అచ్చంపేట, సెప్టెంబర్ 26: ప్రజలను మోసం చేసిన ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేందుకు నల్లమల ప్రజలు, రైతులు సిద్ధంగా ఉన్నారని, వర్షాలు వచ్చినా.. పిడుగులు పడినా.. అచ్చంపేట జనగర్జన సభ(కేటీఆర్ సభ) ఆగదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఈనెల 28న అచ్చంపేటలోని నాగర్‌కర్నూల్ రోడ్డు నేషనల్ హోటల్ వెనుక మైదానంలో జరగనున్న కేటీఆర్ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌తో కలిసి పరిశీలించారు. అచ్చంపేట, నాగర్‌కర్నూల్ ఇన్చార్జి మాజీ ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న కేటీఆర్ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వర్షం వచ్చిన ఇబ్బంది లేకుండా సభావేదిక ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక సీనియర్ నేత పోకల మనోహర్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహాగౌడ్, అ మీనొద్దీన్, మాజీ ఎంపీపీలు కర్ణాకర్‌రావు, పర్వతాలు ఇతర నేతలతో ఏర్పాట్లు, జన సమీకరణ తదితర అంశాలపై చర్చించారు. వర్షాలు వచ్చిన ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారని ఎట్టిపరిస్థితిలో సభ జరగాలని స్థానిక నేతలు చెప్పారు. అనంతరం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఈనెల 28న కేటీఆర్ సభ నాగర్‌కర్నూల్, అచ్చంపేట ఇన్చార్జి, మాజీ ఎ మ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగనుందన్నారు. సభకు నల్లమల ప్రజలు, రైతులు అన్ని వర్గాల ప్రజలు రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
వర్షాలను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంపై నల్లమల గర్జన నుంచి తిరుగుబాటు ప్రా రంభిస్తున్నామన్నారు. హైకోర్టు చెప్పిన స్థానిక సంస్థల ఎ న్నికలు నిర్వహించే పరిస్ధితిలో ప్రభు త్వం కనిపించడం లేదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం స్థానిక సంస్థల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశా రు. సభకు ప్రజ లు పెద్దసంఖ్యలో తరలి విజయవంతం చేయాలనికోరారు. వారి వెంట స్థానిక నేతలు విండో చైర్మన్లు రాజిరెడ్డి, నర్సయ్యయాదవ్, అమ్రాబాద్ మం డల పార్టీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు రమేశ్‌రావు, కుత్బుద్దీన్, మనోహర్, వంశీ, గోపి, ఖలీల్, రాజేశ్ పాల్గొన్నారు.