ఖిల్లాఘణపురం, జనవరి 31 : తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త , తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు దుర్మార్గంగా సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శనివారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ 14 ఏండ్లు అలుపెరుగని పోరాటం చేసి 12రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన త్యాగశీలి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అని అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ రంగంతోపాటు అన్ని రంగాలను అభివృద్ధి చేసి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ర్టాన్ని నిలిపిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. అలాంటి నాయకుడిపై కాంగ్రెస్ ప్రభు త్వం దుర్మార్గంగా సిట్ నోటీసులు ఇవ్వడం హేయమైన చర్య అని, రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు రాళ్లకృష్ణయ్య, మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, మాజీ జెడ్పీటీసీ సామ్యానాయక్, గ్రామ అధ్యక్షుడు బాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, చిన్న ఆంజనేయులు, మన్యంగౌడ్, పెద్ద ఆంజనేయులుగౌడ్, ప్రతాప్, కురుమయ్య, వెంకటయ్య, నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సమాజం క్షమించదు..
గోపాల్పేట, జనవరి 31 : కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ గోపాల్‌పేటలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు బాల్‌రాజు మాట్లాడుతూ సీఎంగా పదేండ్లు అన్ని రంగాల్లో రాష్టాన్ని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. అలాంటి నేతపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరికాదన్నారు. రేవంత్ వ్యవహారం సరికాదని, తెలంగాణ సమాజం క్షమించదన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్, గుండ్రాతి రాజేశ్‌గౌడ్, కేశవులు నాయక్, మొగులాలు, మన్యం, నాయక్, మతీన్, కాశీనాథ్, జహంగీర్, సత్యనారాయణ, మహేశ్, బాల చంద్రయ్య, గోపాల్, వెంకటయ్య, శ్రీనివాసులు, హర్యానాయక్, రాములు, లక్ష్మ య్య, చెన్నయ్య, ఖాజా, శేషయ్య, గోపాల్, వెంకటేశ్, వెంకన్న, దేవయ్య పాల్గొన్నారు.
వనపర్తిలో..
వనపర్తి టౌన్, జనవరి 31 : తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ సీఎం కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, పట్టణ అధ్యక్షుడు పలుస రమేశ్‌గౌడ్ మాట్లాడుతూ సిట్ విచారణ పేరుతో కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు ప్రభు త్వం పాల్పడుతుందని, తెలంగాణ రాష్ట్రం కో సం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన జాతిపిత కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు సాగవని వారు హె చ్చరించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేక ఆధారాలు లేని ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ డ్రామాలు ఆడుతున్నారని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వ కుట్రలు తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమిస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు హేమంత్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్లు తిరుమల్, బండారు కృష్ణ, ఆవుల రమేశ్, సయ్యద్, జమిల్, జోహెబ్, మురళీసాగర్, ప్రేమ్‌కుమార్, మంద రాము, నాగన్నయాదవ్ ఉన్నారు.