దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), నవంబర్ 8 : కారుగుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే సతీమణి ఆల మంజుల, జెడ్పీటీసీ అన్నపూర్ణతో కలిసి కౌకుంట్ల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల ఆరాధ్యదైవం చెన్నకేశవస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ తిరిగి ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ కారుగుర్తుకు ఓటు వేసి ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుజాత, సర్పంచులు కృష్ణవేణి, వైదేహి, శివరాజు, శ్రీనివాసరావు, ఎంపీటీసీ కిష్టన్న, శివకుమార్ పాల్గొన్నారు.
భూత్పూర్, నవంబర్ 8 : వృద్ధులంతా సీఎం కేసీఆర్ వెంటే ఉ న్నారని మండల పరిషత్ అధ్యక్షుడు కదిరె శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చౌలతండా, భట్టుపల్లి, వెల్కిచర్ల గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలోని ఎక్కడాలాని విధంగా ఆసరా పింఛన్‌ను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల పింఛన్లు భారీగా ఇస్తూ రానున్న కాలంలో కూడా బారీగా పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ శ్రీనునాయక్, ముడా డైరెక్టర్ సాయిలు, మాజీ సర్పంచ్ సత్తూర్ నారాయణగౌడ్, నాయకులు గోప్లాపూర్ సత్యనారాయణ, మురళీధర్‌గౌడ్, రామురాథోడ్ పాల్గొన్నారు.
మదనాపురం, నవంబర్ 8 : మదనాపురం మండలంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నదని దేవరకద్ర నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జయంతి అన్నారు. బుధవారం మండలంలోని నర్సింగాపురంలో మండల నాయకులతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలోని ప్రతి పథకాన్ని ప్రజలకు వివరిస్తూ కారుగుర్తుకు ఓటువేసి ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్రెడిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా మండలాధ్యక్షురాలు అనురాధ, మహిళా సమాఖ్య మాజీ అధ్యక్షురాలు అర్చన, తిర్మలాయపల్లి సర్పంచ్ శారద, నాయకులు లక్ష్మణ్‌రావు, అశోక్ పాల్గొన్నారు.
మూసాపేట, నవంబర్ 8 : అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని గెలిపించి అభివృద్ధి, సంక్షేమానికి మద్దతు పలుకుదామని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం చేశారు. బుధవారం మండలంలోని చక్రాపూర్‌లో ఇంటిం టి ప్రచారం నిర్వహించి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి చేసి అభివృద్ధిని వివరించి కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.