నారాయణపేట, మార్చి 16 : ఒక వైపు కోర్టులో కేసు నడుస్తుండగా మరో వైపు ఎ మ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చే యడం రాజకీయ కుట్రలో భాగమేనని, అ రెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారాయణపేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్టు చేయడం అన్యాయమన్నారు.
అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు లో చెప్పిన మాటను తప్పుతున్న ఈడీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను దెబ్బ తీసేందుకే బీజేపీ తన అధికారాన్ని ఉపయోగించుకొని అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు చంద్రకాంత్, జగదీశ్, సుదర్శన్‌రెడ్డి, చెన్నారెడ్డి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.