గద్వాల, జూన్ 12 : అధికార పార్టీనేతల అండదండలతో గుట్టుగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దుకాణాలు చేజిక్కించుకోవ డానికి మున్సిపల్ అధికారులు, అధికార పార్టీ నాయకులు గూడు పుఠానీ చేశారు. ఇది గ్రహించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు శ్రుక్రవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అధికార పార్టీ నాయకులకు ఏమి చేయాలో తోచక తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు అవరణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం హ యాంలో మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చేందుకు సమీ కృత ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పనులు చేపట్టారు.
రూ.3కోట్ల వ్యయంతో 38 దుకాణాలు నిర్మించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు హడావుడిగా వాటిని ప్రారంభి ంచారు. గత ఆగస్టులో వేలం ద్వారా ఒప్పంద ప్రాతిపదికన దుకాణాలు మొత్తం అద్దెకు ఇవ్వడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. తక్కువ దరఖాస్తులు రావడంతో వేలాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం ఆ దుకాణాలకు చెందిన వేలం ప్రకటనను అంతగా సర్క్యులేషన్ లేని పత్రికలో గత నెల 19వ తేదీన పేపర్ ప్రకటన ఇచ్చారు. అయితే దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 6వ తేదీ చివరికి నిర్ణయించారు. 6వ తేదీ వరకు 38 దుకాణాలకు కేవలం 15 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
అయితే గద్వాల మున్సిపాలిటీకి చెందిన ఓ అధికారి గుట్టుచప్పుడు కాకుండా ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తులు అందజేయడానికి అవకాశం కల్పించినట్లు నోటీస్ బోర్డులో ఉంచారు. అయితే 9వ తేదీ నాటికి మున్సిపాలిటీ నుంచి 75 టెండర్ దరఖాస్తులు తీసుకెళ్లగా 68మంది మాత్రమే ము న్సిపాలిటీలో టెండర్ దరఖాస్తులు అందజేశారు. అయితే ఈ విషయం బయటకపొక్కడంతో దుకాణాల కేటాయింపులో గూడు పుఠానీ గ్రహించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు సంటెన్న, జగదీశ్, రాములు, మోహన్ యాదవ్, పులిపాటి వెంకటేశ్, నర్సింహ, నాయకులు చిత్తారి కిరణ్, రాములు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 16వ తేదీ వరకు పెంచాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించినట్లు తెలిసింది..
అధికార పార్టీ నేత అండతో గుట్టుగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో తక్కువ వేలం పాడి దుకాణాలు కాజేయానికి పావులు కదిపినట్లు తెలిసింది. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులు, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా ప్రతినిధులకు తక్కువ వేలానికి దుకాణాలు పొందేలా ప్రణాళిక రూపొందించుకొని మున్సిపల్ అధికారుల ద్వారా తతంగం నడపడానికి ఇక్కడి అధికార పార్టీ నేత ప్రయత్నిం చినట్లు తెలిసింది. ఈ విషయం బీఆర్ఎస్ కౌన్సిలర్లకు తెలియడంతో వారి తతంగం అంతా కలెక్టర్‌కు తెలియజే శారు. టెండర్ గడువు పొడిగించడానికి మున్సిపల్ అధికా రులు పూనుకున్నట్లు సమాచారం. ఎంత ఎక్కువ మంది దుకాణాలకు పోటీకి వస్తే అంతా ఆదాయం మున్సిపాలిటీకి పెరిగే అవకాశం ఉంది. ఇవేవి ఇక్కడి అధికార పార్టీ నేత పట్టించుకోకుండా ఎక్కువ మంది టెండర్లు వేయకుండా లో లోపల తన అనుయాయులకు గుట్టుగా దుకాణాలు కేటాయి చడానికి పూనుకున్నారు. ఇది బెడిసి కొట్టడంతో తన అనుయాయుల ద్వారా ఆనేత కొత్త నాటకానికి తెర లేపినట్లు తెలిసింది. అధికారుల ద్వారా ఎక్కువమంది టెండర్లలో పా ల్గొంటే ఎక్కువ కిరాయిలు పాడుతారు ఆ తర్వాత కిరాయిలు చెల్లించకుండా ఎగవేస్తారని కలెక్టర్‌కు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా బీఆర్ఎస్ కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో గడువు పెరిగి మరింత మంది దుకాణాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలిగింది.
వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ ఓపెన్ వేలం దరఖాస్తుల విషయపై శుక్రవారం బీఆర్ఎస్ కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో దుకాణాల ఓపెన్ వేలం నిమిత్తం దరఖాస్తుల స్వీకరణ ముందుగా ప్రకటించిన గడువును పొడిగించినట్లు మున్సిపల్ కమిషనర్ జానకీరామ్‌సాగర్ తెలిపారు. ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను ఈనెల 16వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు పురపాలక సంఘం కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఈ నెల 19న ఓపెన్ వేలం యథావిధిగా నిర్వహిస్తున్నట్లు కమిషనర్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు.