మహబూబ్‌నగర్ అర్బన్, ఏప్రిల్ 20 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనను విజయవంతం చే యాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చా రు. శనివారం పార్టీ అధినేత పర్యటనపై మహబూబ్‌నగర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మా జీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనను విజయవంతం చే యాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా పరిధిలో రైతులు, ప్రజలతో మాట్లాడడంతోపాటు రోడ్ షోలలో కేసీఆర్ పాల్గొంటారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని, అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీ లు ఇవ్వడంతోపాటు తప్పుడు ప్రచారంతో ఎన్నిక ల్లో గెలిచారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పింఛన్లు ఇవ్వలేక, రైతుబంధుకు రాంరాం చెప్పడం,రుణమాఫీ చేయలేదని దుయ్యబట్టారు. ప్రజలంతా హస్తం పార్టీ పాలనపై విసిగిపోయారని,
మరోసారి గులాబీ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోయే మున్సిప ల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అత్యధిక స్థానా ల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ మారిన వారి గురించి ఆలోచించవద్దని, క ష్టాల్లో పార్టీ కోసం నిలబడిన వారికి భవిష్యత్తులో పదవులు దక్కుతాయని చెప్పారు. కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని, బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల మాజీ ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తన చేతగాని తనాన్ని ఎంతోకాలం దాచలేకపోయిందన్నారు. ప్రజలకు మూడు నెలల్లోనే వారి పాలన అర్థమైందని, బీఆర్ఎస్ను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నా రు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నేడు పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు.
కాంగ్రెస్ అసమర్థ పాలనపై ప్రజలకు వివరించి బీఆర్ఎస్ గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు శివరాజ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెహమాన్, నాయకుడు గోపాల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.