8వ వార్డు అభ్యర్థి గెలుపుపై హైడ్రామా
గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు అభ్యర్థి గెలుపు పై కౌంటింగ్ హాల్లో హైడ్రామా నడిచింది. ఓట్ల లెక్కింపు అనంతరం మొదట అధికారులు మూడు ఓట్లతో ఆ తర్వాత ఒక ఓటుతో గెలిచిందని అక్కడ ఉన్న అధికారులు అభినందనలు తెలిపారు.
- మొదట బీఆర్ఎస్ అభ్యర్థి జయమ్మ ఒక్క ఓటుతో గెలిచిందని ప్రకటించిన అధికారులు
- రీ కౌంటింగ్ కోరిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మ
- ఒక్క ఫోన్‌కాల్‌తో ఫలితాన్ని తారు మారు చేసిన వైనం
గద్వాల, ఫిబ్రవరి 13 : గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు అభ్యర్థి గెలుపు పై కౌంటింగ్ హాల్లో హైడ్రామా నడిచింది. ఓట్ల లెక్కింపు అనంతరం మొదట అధికారులు మూడు ఓట్లతో ఆ తర్వాత ఒక ఓటుతో గెలిచిందని అక్కడ ఉన్న అధికారులు అభినందనలు తెలిపారు. అయితే ఆ ఫలితంపై కాంగ్రెస్ అభ్యర్థి వెంకటమ్మ రీ కౌం టింగ్ కోరగా అధికారులు రీ కౌంటింగ్ నిర్వహించారు. రీ కౌంటింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఆర్వోకు అధికార పార్టీ నాయకుల నుంచి ఫోన్ రావడంతో ఒక్క ఫోన్ కాల్‌తో ఎన్నికల అధికారులు ఫలితాన్ని తారు మారు చేశారు. ఇన్వ్యాలీడి ఓటు కింద ఉన్న ఓటును తీసి అధికార కాంగ్రెస్ పార్టీకి అక్కడి ఆర్వో కలపడంతో ఫలితం తారుమారై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటమ్మ ఒక ఓటుతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే దీనిపై మొదట గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి తిరిగి రీకౌంటింగ్ నిర్వహించాలని కోరినప్పటికి అధికారులు పట్టించుకోకుండా వారిని బయటకు పంపారు. వారు అడిగితే రీ కౌంటింగ్ నిర్వహించారు. మేము అడిగితే ఎందుకు నిర్వహించడం లేదని బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్వోతో వాదనకు దిగారు. అయినప్పటికీ ఎన్నికల అధికారి మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పడంతో వారు బయటకు వచ్చి శాట్ చైర్మన్ ఆంజనేయగౌడ్, బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ నాయకుడు హనుమంతునాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్‌తో కలిసి కౌంటింగ్ హాల్ బయట రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. ఫలితాల తారు మారుపై బీఆర్ఎస్ నాయకులు హైకోర్టుకు వెళ్తున్నట్లు తెలిసింది.
రీ కౌంటింగ్‌తో కుట్ర..
రీ కౌంటింగ్‌తో కుట్ర జరిగిందని శాట్ చైర్మన్ ఆంజనేయగౌడ్, బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ నాయకుడు హనుమంతునాయుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ కేశవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా వార్డు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి గద్వాల-రాయిచూర్ రహదారి సమీపంలో ధర్నా నిర్వహించారు. రీ కౌంటింగ్‌తో ఎమ్మెల్యే కుట్ర చేస్తున్నారని వారు ఆరోపించారు. బీఆర్ఎస్ అ భ్యర్థులకు గెలిచినట్లు ధ్రువీకరణ పత్రం ఇవ్వకుం డా పదేపదే రీకౌంటింగ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకు లు వెంకటేశ్వరరెడ్డి, అంగడి బస్వరాజ్, రాఘవేంద్రరెడ్డి, బీచుపల్లి, నరసింహులు, తిరుమలేశ్, రఘు తదితరులు పాల్గొన్నారు.
మాకు అన్యాయం చేశారు : జయమ్మ
ఎన్నికల అధికారులు, ఆర్వో, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారారు. ఆర్వో మొదట తాము గెలిచామని ప్రకటించారని. ఒక్క ఫోన్‌కాల్ రావడంతో ఆర్వో ఎన్నికల ఫలితాలను తా రుమారు చేసి రీ కౌంటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని చెప్పారు. అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి గెలుపొందిన అభ్యర్థిని ఓడినట్లు ఓడిన అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటించడం అన్యాయం. ఇన్వ్యాలిడీ ఓటుగా ఉన్న దానిని ఫలితం తారుమారు చేయడానికి ఆర్వో వ్యాలిడీ ఓటుగా మార్చి తమకు గెలుపు దక్కకుండా అన్యాయం చేశారని దీనిపై హైకోర్టు ను ఆశ్రయిస్తున్నట్లు చెప్పారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

