పెంట్లవెల్లి, ఏప్రిల్ 21 : చిత్త శుద్ధిలేని కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎనికల్లో ప్రజలు ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ఆదివారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేసి వారిని రాజును చేస్తే…మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అదే రైతులను మోసం చేసి రోడ్డున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లాపూర్ ప్రాంతంలో పెండింగ్ పనులను ఈ ప్రాంత మంత్రి జూపల్లి కృష్ణారావు చిత్తశుద్ధితో పూ ర్తి చేయాలని సూచించా రు. విద్యావంతుడైన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అ త్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే ప్రజాగొంతుకై మన ప్రాంత సమస్యలను ఢిల్ల్లీలో కొట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తారన్నారు. కాంగ్రెస్, బీజేపీలను చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతకు ముందు పెంట్లవెల్లిలోని ప్రధాన రహదారిపై ఉన్న దుకాణ సముదాయ యాజమానులను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. పాత బస్టాండ్ సమీపంలో గులాబీ జెండాలె రామక్క పాటకు కార్యకర్తలతో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చేసిన నృ త్యం ఓటర్లను ఎంతగానో ఆకట్టుకున్నది.
ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన మీ మట్టి బిడ్డను.. నన్ను పార్లమెంట్ ఎన్నికలో అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించండి. పార్లమెంట్లో ఈ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం పోరాడుతాను. ఎక్కడి నుంచో వచ్చిన దొంగలకు ఓటు వేస్తే మళ్లీ మోస పోతాం.. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రభు త్వం అన్నివిధాలుగా అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. తెలంగాణ ప్రజలు తిరిగి మళ్లీ కేసీఆర్ రావాలి అంటున్నారు. ఇప్పుడు గనుక తిరిగి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారు. కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పేందుకు కారుగుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి . మీ ప్రాంత సమస్యల పరి ష్కారం కోసం నిరంతం మీ వెంటే ఉంటా..