అసెంబ్లీలో ఆడబిడ్డలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన నీచమైన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. పలుచోట్ల రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. నల్లబ్యాడ్జీలు ధరించి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న గులాబీ శ్రేణులపై పోలీసులు నిర్బంధంతో అడ్డుకునేందుకు యత్నించారు.
కొందరిని అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. వనపర్తిలో నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహిళా ఎమ్మెల్యేలను కించపర్చడం సీఎం పదవికే కళంకమని, వారికి బేషరుతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే పలువురు నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కు తూ, ఎన్నికల హామీలు అమలు చేయమని అడిగితే సీఎం సమాధానం ఇవ్వకుండా ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. మహి ళలను అవమానించే వ్యాఖ్యలు చేస్తూ దురహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
– మహబూబ్‌నగర్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)