మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ప్రగతి ప్రదాత.. గులాబీ దళపతి.. మాజీ సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్, అభిమానుల ఆధ్వర్యంలో వేడుకలు అంబరాన్నంటాయి. కేసీఆర్ చిత్రపటాలు, ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. జై కేసీఆర్.. సాహో సంక్షేమ సారథి అన్న నినాదాలతో కార్యకర్తలు, నాయకులు హోరెత్తించారు. కేక్‌లు కట్ చేసి అభిమాన నేతకు శుభాకాంక్షలు తెలిపి ఒకరికొకరు తినిపించుకున్నారు. చౌరస్తాల్లో పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. మోటర్ సైకిళ్ల ర్యాలీలు చేపట్టారు. పట్టణ, మండల కేంద్రాల్లోని దవాఖానల్లో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. దేవరకద్ర పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మద్దూరు, కోస్గిలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, వనపర్తిలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, గద్వాలలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉద్యమ కెరటమై ఎగిసి.. పరిపాలనలో మేటిగా నిలిచి తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఢిల్లీ కోటపై ఎగురవేసిన ధీశాలి, పాలమూరు ప్రాజెక్టు ప్రాజెక్టు ప్రదాత కేసీఆర్ అన్నారు.
పెంట్లవెల్లి, ఫిబ్రవరి 17 : తమ అభిమాన నేత, రైతు బాంధవుడు కేసీఆర్ జన్మదిన వేడుకలను పచ్చని పంట పొలాల్లో రైతులు, బీఆర్ఎస్ నాయకులు జరుపుకొన్నారు. మంగళవారం సాయంత్రం పెంట్లవెల్లి మండలం జటప్రోల్ శివారులో డ్రోన్ ద్వారా కేసీఆర్ ఫొటోతో ఉన్న గులాబీ జెండాను ఎగురవేసి సంబురాలు చేసుకున్నారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు అని కొనియాడారు
మద్దూర్/కోస్గి, ఫిబ్రవరి 17 : రాజ్యాంగ విరుద్ధంగా మద్దూరు మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకున్నదని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. నారాయణపేట జిల్లా మద్దూరు, కోస్గిలో మంగళవారం నిర్వహించిన ప్రగతి ప్రదాత కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు కార్యకర్తలు, నాయకులు జై కేసీఆర్ అన్న నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కేక్‌లు కట్ చేసి అభిమాన నేత కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను డబ్బు, మద్యంతో కాం గ్రెస్ నాయకులు ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో నేరుగా గెలవలేక అప్రజాస్వామికంగా.. ప్రజాస్వామ్యా న్ని అపహాస్యం చేసేలా ఎన్నికల్లో గెలిచిందన్నారు. సీఎం సోదరుడికి ఏ అర్హత ఉన్నదని మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్నారో అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎనుముల రాజ్యాంగా న్ని అమలు చేస్తున్న అధికారులకు రాబో యే రోజుల్లో శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు.
ఎన్నికల ప్రక్రియ సీసీ ఫుటేజీని అందించాలని, లేకుంటే అధికారుల తీరుపై న్యా యస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు గోపాల్, జనార్దన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, మధు యాదవ్, వెంకట నర్సింహులు, కౌన్సిలర్లు దినేశ్, మౌలానా, నర్సింహులు, మున్యానాయక్, సంగీత, శివకుమార్, నాయకులు మహిపాల్, వెంకటేశ్, రాజు పాల్గొన్నారు.