మరికల్ : కార్యకర్తల కుటుంబానికి బీఆర్ఎస్ (BRS) పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ మరికల్ మండల అధ్యక్షుడు లంబడి తిరుపతయ్య ( Tirupataiah) , జిల్లా సీనియర్ నాయకులు రాజ వర్ధన్ రెడ్డి, మండల మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సంపత్ కుమార్ అన్నారు.
పసుపుల గ్రామానికి చెందిన శివయ్య ( Shivaiah ) గత ఏడాది పాముకాటుతో ( Snake Bite) మృతిచెందగా ఆయన భార్య మస్తు లక్ష్మికి సభ్యత్వ నమోదులో భాగంగా చేసిన బీమా పథకంలో రూ. 2 లక్షల చెక్కును ఆయన కుటుంబానికి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తకు అధిష్టానం అండగా ఉంటుందని తెలిపారు. నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సహకారంతో చెక్కును అందించామని వారు వివరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రవికుమార్, మాజీ ఉప సర్పంచ్ నరసింహారెడ్డి, నాగేష్ గౌడ్, తిమ్మయ్య గౌడ్, నరసింహులు గౌడ్, బాలయ్య గౌడ్, రాజు గౌడ్, తిరుమలయ్య, సతీష్, ఆశప్ప, దశరథ శెట్టి, జనార్దన్ గౌడ్, అంజయ్య గౌడ్, వెంకటయ్య , అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.