మరికల్ : మరికల్ మండల కేంద్రంలోని మంగలోని వంపు దగ్గర బ్రిడ్జి నిర్మాణ ( Bridge Works) పనులను జిల్లా కాంగ్రెస్ నాయకుడు సూర్య మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ నాయి బ్రాహ్మణుల వినతిమేరకు ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి నాయి బ్రాహ్మణుల స్మశాన వాటికకు వెళ్లేందుకు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఎస్డీఎఫ్ నిధులు ( SDF funds) మంజూరు చేయడంతో బ్రిడ్జి పనులను ప్రారంభించినట్లు తెలిపారు.
స్మశాన వాటికకు వెళ్లాలంటే మురుగునీటిలో వెళ్లే దుస్థితి ఉండేదని పేర్కొన్నారు. మరికల్ మండలంలోని పసుపుల ప్రాథమిక పాఠశాలను ఆయన పరిశీలించారు. పాఠశాలకు మిగిలిన కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు కూడా వెంటనే ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు హరీష్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్, కాంగ్రెస్ నాయకులు మంగలి రఘు, చెన్నయ్య, రామకృష్ణారెడ్డి, పెంట మీద రఘు, శివ కుమార్, బీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు గోపాల్, వెంకట్ రాములు, శ్రీకాంత్, శివ, బిసన్న తదితరులు పాల్గొన్నారు.