వడ్డేపల్లి, జనవరి 21 : మండంలోని జిల్లెడదిన్నెలో పంచాయతీ కార్యదర్శి అశోక్ ఇష్టారాజ్యంగా అర్హుల జాబి తా తయారు చేశాడని గ్రామసభకు కుర్చీలు, టెంటు, కనీ స సౌకర్యాలు లేకుండా సభను నిర్వహించడంపై అసహ నం చెందిన గ్రామస్తులు గ్రామసభను బహిష్కరించి ఇం డ్లకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు ఎంపికైన జాబితాను గ్రామసభలో వెల్లడించడానికి ఏర్పాటు చేయగా.. గ్రామసభలో ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులకు ఎంపికైన వారి జాబితాలో అందరికీ ఆమోదయోగ్యంగా లేవని, ఒక్కరికి మూ డు రేషన్‌కార్డులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
దరఖాస్తులు తీసుకోవడం, సర్వే చేయడం తప్పా ప్రభుత్వం ఏం చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజలు గ్రామసభను బహిష్కరించారు. జీపీ కార్యదర్శి పంచాయతీ కా ర్యాలయంలో ఒక పెద్ద గదిని ఆర్డీఎస్ వారికి ఎలా ఇచ్చారని, గదికి తాళం ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఆత్మీ య భరోసా 60, రేషన్ కార్డులు 35, ఇందిరమ్మ ఇండ్లు 147 దరఖాస్తులు వచ్చాయని చెప్పడంతో ఇష్టారాజ్యంగా ఎంపిక చేశారని, అర్హుల జాబితాలో జీపీ కార్యదర్శి నిర్లక్ష్యం వహించాడని, వ్యవసాయేతర భూమి గుర్తింపు తప్పుల తడకగా ఉందని, ఇండ్లులేని వారికి ఇండ్లు ఇవ్వాలని, గ్రామసభను తూతూమంత్రంగా ముగించడపైం కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని అధికారులను నిలదీశారు. ఇం తలో ఎంపీడీవో రామకృష్ణ కలుగజేసుకొని ప్రజలకు కుర్చీ లు, టెంటు వేయాలని సూచించామని తప్పిదం జరిగిందని కాస్త టైం ఇస్తే అన్ని ఏర్పాటు చేస్తామని సర్దిచెప్పారు. ఎట్టకేలకు మధ్యాహ్నం గ్రామసభను మళ్లీ నిర్వహించారు.