అలంపూర్, ఫిబ్రవరి 23 : మండలంలోని క్యాతూరులో నాలుగేండ్ల బాలుడు కుక్కకాటు గురై మృతి చెందాడు. బాలుడు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆదివారం పీహెచ్సీ వద్ద బా లుడి మృత దేహం ఉంచి కుటుంబ సభ్యులు నిరసన చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యుల, గ్రామస్తుల కథనం మేరకు గ్రామానికి చెందిన వరలక్ష్మి, సాయికుమార్ దంపతులకు హర్షవర్దన్ (4), హ ర్షిత ఇద్దరు సంతానం. జనవరి 22వ తేదీన ఇద్దరు పిల్లలు ఇంటి వద్ద కుక్క కాటుకు గురయ్యారు.
గుర్తించిన తల్లిదండ్రులు వారిద్దరిని స్థానికంగా ఉన్న పీహెచ్సీకి తరలించారు. అక్కడ సిబ్బంది ప్రా థమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స నిమిత్తం అలంపూర్ ద వాఖానకు రెఫర్ చేశారు. అక్కడ హర్షితకు వైద్యులు చికిత్సలు అం దించారు. తల్లిదంద్రులు, వైద్యులు హర్షవర్దన్ ఒంటిపై ఎలాంటి కుక్కకాటు గుర్తులు గుర్తించలేకపోవడంతో ఎలాంటి చికిత్స చేయలేదు. ఇదిలా ఉండగా హర్షవర్దన్ ప్రవర్తన,ఆరోగ్య స్థితిలో రోజు రోజుకు మార్పులు గమనించి తల్లిందండ్రులు పెద్ద దవాఖానలో వైద్యం చేయించారు. కాగా కర్నూల్, హైదరాబాద్ దవఖానల్లో చి కిత్స చేయించినప్పటికీ వైద్యులు బాలుడిని కాపాడలేకపోయారు. ఆదివారం తెల్లవారు జామున బాలుడు హర్షవర్దన్ మృతి చెందా డు.
సరైన సమయంలో వైద్యం అందించలేక పోయారనే ఆరోపణలలో బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం బాలుడి మృతదేహంతో క్యాతూరు పీహెచ్సీ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. విష యం తెలుసుకున్న అలంపూరు ఎస్సై వెంకటస్వామి ఘటనా స్థలానికి చేరుకొని సర్ది వారికి చెప్పి శాంతింప చేశారు. అనంతరం బా లుడి మృత దేహాన్ని అలంపూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు అనంతరం బాలుడు కుక్కకాటు వల్లె మృతిచెందాడా, లేక మరే ఇతర కారణాల వల్ల మృతి చెందాడా అన్న విషయాలు స్పష్టమవుతాయని ఎస్సై వివరించారు. మృతుడి తండ్రి సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.