బిజినేపల్లి, నవంబర్ 9 : ప్రమాదవశాత్తు బాలుడు నీటి గుంటలో పడి మృతిచెందిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిం ది. పోలీసుల వివరాల ప్రకా రం.. పాలెం గ్రామంలోని సుబ్బయ్య కాలనీకి చెందిన మంజుల భర్త రెండేళ్ల కింద ట మృతిచెందాడు. మంజుల నిత్యం కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది.
తన కుమారుడు శశిధర్(3)ను శనివారం ఇంటి వద్ద వదిలిపెట్టి పనులకు వె ళ్లింది. సాయంత్రం 7గంటల ప్రాంతంలో వచ్చి చూ డగా ఎక్కడా కనిపించలేదు. ఇంటి సమీపంలో నిర్మిస్తున్న కొత్త ఇంటి పిల్లర్ గుంతలో నిలిచిన నీటిలో బాలుడు పడినట్లు గుర్తించారు. బాలుడిని బయటికి తీసి చూడగా, అప్పటికే మృతిచెందాడు. మృతుడి తల్లి మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.