మక్తల్, మార్చి 20: ఆడుకుంటూ ఇంటి ఎదుట ఉన్న నీటి తొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన మక్తల్ మండలం పారేవుల గ్రామంలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన చాకలి జానకిరామ్ హరిత దంపతులు. వీరికి మొదటి సంతానం అఖండేశ్వర్(2) ఉన్నాడు. అయితే బాలుడి తల్లి హరిత ఉగాది పండగకు తన తల్లిగారి ఊరు అయిన మాగనూరు మండలం, ఉజ్జల్లి గ్రామానికి వెళ్లింది.
ఈ క్రమంలో బాలుడు ఆడుకుంటూ ఇంటి ఎదుట ఉన్న నీటి తొట్టిలో పడిపోయాడు. బాలుడి కోసం కుటంబ సభ్యులు వెతకగా నీటి తోటిలో ఉండడాన్ని గమనించి, హుటాహుటిన మక్తల్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి బాలుడు మృతిచెందినట్లు తెలిపారు. పండుగ కోసం వెళ్లిన కొడుకు విగతజీవిగా మారడంతో మృతు డి తండ్రి జానకిరామ్తో పాటు కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అత్తగారి కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు మృతి చెందాడనరి బాలుడి తండ్రి విలపించాడు.