బిజినేపల్లి : నాగర్ కర్నూల్ (Nagarkurnool District) జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండ గ్రామ సమీపంలోని కేఎన్ఐ (KLI canal ) కాలువలో గుర్తు తెలియని యువకుడి మృతదేహాం ఆదివారం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సమీపంలోని కేఎల్ఐ కాలువ వెంట వెళ్తున్న గ్రామస్థులకు కాలువలో కొట్టుకుపోతున్న యువకుని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుని మృతదేహాన్ని బయటికి తీయించి వివరాలు సేకరిస్తున్నారు.