మరికల్, డిసెంబర్ 5 : నారాయణపేట జిల్లా మరికల్ మండలకేంద్రంలో చివరి మజిలీకి ఇక్కట్లు తప్పడం లేదు. మరికల్ మండల కేంద్రంలోని నాయీబ్రాహ్మణ శ్మశానవాటిక వద్దకు మృతదేహాన్ని పూడ్చేందుకు తీసుకెళ్లాలంటే సాహసం చేయాల్సిందే. మరికల్ నుంచి పెద్దచింతకుంట దారిలోని శ్మశానవాటిక వద్దకు వెళ్లే మంగలోని వంపులో నీరు పారుతున్నది.
దీంతో ఎవరైనా మరణిస్తే ఇదే నీటిలో నుంచి శ్మశానవాటికకు వెళ్లాల్సి వస్తున్నది. అయితే, గతంలో ఈ రోడ్డును ఉపాధి హామీ పథకంలో భాగంగా మరమ్మతులు చేపట్టారు. అలాగే రైతులు కూడా ఇదే నీటిలో పొలాలకు వెళ్లాల్సి వస్తున్నది. ఎమ్మెల్యే స్పందించి ఈ దారిలో కల్వర్టు నిర్మించాలని నాయీ బ్రాహ్మణులు, రైతులు కోరుతున్నారు.