అచ్చంపేట : అచ్చంపేట ( Achampeta ) పట్టణంలో ఆదివారం శ్రీశ్రీశ్రీ మహా త్రిపుర సుందరి స్వరూపమైన గ్రామ బొడ్రాయి ( Bodrai ) పున:ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు( Former MLA Balaraj ) బొడ్రాయి వద్ద నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం పోచమ్మ తల్లి నూతన ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దీవెనలు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహ గౌడ్, తులసీరామ్ , కౌన్సిలర్లు మనోహర్ ప్రసాద్, అంతటి శివ, రమేష్ రావు, కుత్బుద్దీన్, మాజీ జడ్పీటీసీ రాంబాబు నాయక్, నాయకులు, అమీనొద్దీన్, శంకర్ మాదిగ, గంట్ల సురేష్, సోషల్ మీడియా ఇన్చార్జి పిల్లి బాలరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.