మహబూబ్‌నగర్, ఆగస్టు 12 : ప్రభుత్వ దవాఖానలో ప్రసవాలు తగ్గిపోతున్నా యి. వైద్యులు, మెరుగైన సేవలు, అన్ని రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తున్న ది. మౌలిక వసతులు లేక అక్కడి ప్రసవా ల సంఖ్యపై ప్రభావం చూపుతోంది. పాలమూ రు జనరల్ దవాఖానలో పరిస్థితి మరీ దారుణం.. రక్త పరీక్షలు, ప్రెగ్నెన్సీ కిట్లు లేక చాలా మంది మహిళలు ఇబ్బందులు పడ్తున్నారు. ప్రైవేట్ మెడికల్ దుకాణాలకు వెళ్లి కిట్లను కొనుగోలు చేయాల్సిన దుస్థితి. మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల కన్నా మ ందులు, ఇంజెక్షన్లు ఎక్కువగా అవసరం అయ్యేవి జనరల్ దవాఖానకే.. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఉమ్మడి జిల్లాల నుంచి సైతం రోగులు ఇక్కడికి వందలాదిగా ఓపీకి నిత్యం వస్తుంటారు.
వీరిలో చాలా మంది ప్రెగ్నెన్సీ టెస్టుల కోసం వస్తుండడంతో కిట్ల కొరత ఏర్పడింది. కొన్ని నెలలుగా అందుబాటులో లేకపోవడం తో పలువురు మహిళలు ఇబ్బందులు పడ్తున్నారు. గర్భం దాల్చిన మహిళకు మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో రక్త పరీక్షలు చేస్తుంటారు. అయితే రక్త శాతం ఎంత ఉందో తె లుసుకోవడానికి టీ-హబ్‌ను పలువురు ఆశ్రయిస్తున్నా.. రిపోర్టులు రావడానికి ఒకరోజు సమ యం పడుతుండడం.. అది కూడా సద రు మహిళల ఫోన్‌కు రిపోర్ట్ వివరాలు వస్తున్నాయి.
దీంతో రక్త పరీక్షలు లేక ప్రెగ్నెన్సీ కిట్లు లేక గర్భిణులు, మాతాలు తప్పని పరిస్థితులలో ప్రైవేటు దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రైవేటు దవాఖానల నుంచి ప్రభుత్వ దవాఖానలకు వైద్యం కోసం వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే.. కానీ ప్రస్తుత ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్యశాలలపై ఆశలు సన్నగిల్లి.. గతంలో మాదిరి ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే రోజులను గుర్తుకు తెచ్చే పరిస్థితి దాపురించింది.
కేసీఆర్ పదేండ్ల పాలనలో కేసీఆర్ కిట్‌తోపాటు రోగులకు, గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందేవి. గర్భిణులకు ప్రసవ వేదన లేకుండా డాక్టర్లు 24 గంటలు అందుబాటు లో ఉండి అన్ని రకాల రక్త పరీక్షలు, వీటికి సంబంధించిన కిట్లు అందుబాటులో ఉం డేవి. అమ్మ ఒడి పేరుతో ఆడపిల్ల పుడితే రూ. 13 వేలు.. బాబు జన్మిస్తే రూ.12 వేలు ప్రో త్సాహకంగా అందేది. పారితోషికం అందజేస్తుండడంతో సుఖ ప్రసవాల కోసం మహిళలు ప్రభుత్వ దవాఖానలకు వచ్చేవారు. దీంతో వేల సంఖ్యలో ప్రసవాలు జరిగాయి. కానీ నేడు రక్త పరీక్షల లేక మహిళలు, ప్రెగ్నెన్సీ కిట్లు అందుబాటులో లేక గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రెగ్నేసి కిట్లు లేనట్లు మా దృష్టికి రాలేదు. మా వైద్యులతో మాట్లాడి వెంటనే కిట్లను తెప్పించి అందుబాటులో ఉండేలా చూస్తాం. ఈ కిట్లు అందుబాటులో లేవు అనే విషయం ఎవరూ మాకు చెప్పలేదు. మా పార్మసి అధికారులతో మాట్లాడి కోరత లేకుండా ఏర్పాటు చేస్తాం.
– డాక్టర్ రంగా అజ్మీరా, సూపరింటెండెంట్, మహబూబ్‌నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖాన