పాలమూరు, ఏప్రిల్ 2 : అసత్య ప్రచారాలు మాని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. మహబూబ్‌నగర్‌లోని పద్మావతికాలనీ గ్రీన్‌బెల్ట్ వ ద్ద మంగళవారం సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి శ్రీనివాస్‌గౌడ్ పూలమా ల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ తెలంగాణ వచ్చాకే మహనీయుల చరిత్రను ప్రపంచానికి చాటేలా వారి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని అధికారికంగా జయంతి, వర్ధం తి నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. బహుజన వ్య తిరేకి అయిన వంశీచంద్‌రెడ్డి అసత్య మాటలు మా ట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంశీచంద్‌కు సర్వాయి పాపన్న, ఆయన చరిత్ర తెలియదన్నారు. పాలమూరులో పాపన్న విగ్రహం పెట్టిందెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. తన అభ్యర్థన మే రకే ట్యాంక్‌బండ్‌పై పాపన్న విగ్రహ ఏర్పాటుకు రూ.3కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వు లు జారీ చేసిందన్నారు.
కానీ తాను పాపన్న విగ్ర హం పెట్టమని అడగలేదని, జయంతి, వర్ధంతి అధికారికంగా చేయాలని కోరలేదని వంశీచంద్‌రెడ్డి త ప్పుడు ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. ప్రభు త్వ ఉత్తర్వులు చూసి మాట్లాడాలని హితవు పలికా రు. 720 ఎకరాలు కబ్జా చేశానని ఆరోపిస్తున్నారు.. ఏడు గజాలైనా కబ్జా చేసినట్లు నిరూపించూ.. అది అబద్ధం అని తెలిస్తే క్లాక్‌టవర్ వద్ద ముక్కు నేలకు రాస్తావా? అని సవాల్ విసిరారు. బహుజనులు ఇండ్లు కట్టుకోకుండా గుడిసెల్లోనే ఉండాలా? తన పై ఆరోపణలు చేస్తే ఎన్నికల్లో ఓట్లు పడతాయని అ నుకుంటున్న బహుజన వ్యతిరేకి వంశీచంద్‌రెడ్డికి ఎ న్నికలలో బుద్ధి చెప్పాలని ప్రజలకు సూచించారు. తన ఓటమి కోసం బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయని విమర్శించారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, జె డ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వారాజ్, గ్రంథాలయాల సంస్థ మాజీ చై ర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ కేసీ నర్సింహులు, ఎంపీపీ సుధాశ్రీ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.