ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.
- ఆలయాల్లో ప్రత్యేక పూజలు, సన్మానాలు, కేక్ కటింగులు
- విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, క్రీడాకారులకు బహుమతులు ప్రదానం
నమస్తే తెలంగాణ నెట్వర్క్, జనవరి 30 : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. బైక్ ర్యాలీలు, ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ, విద్యార్థులకు పుస్తకాలు, క్రీడా పోటీలు, గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, సతీమణి చిట్టెం సుచరిత పాల్గొని కేక్‌ను కట్ చేశారు. హాజరైన నాయకులు, కార్యకర్తలు అభిమాన నేతను పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఊట్కూర్ మండలంలో ఎమ్మెల్యే నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన పంచ్మసీదు షాపింగ్ కాంప్లెక్స్‌ను చిట్టెం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులు, ప్రజల అండదండలతో నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

