భూత్పూర్: రాష్టాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్న ప్రభుత్వానికి ప్రజల సహకారం ఇవ్వాలని ఎమ్మెల్యే ఆల వెంక టేశ్వర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో రైతువేదికలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
అనంతరం తాటికొండ గ్రామంలో మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.1లక్షా 50వేల వ్యయంతో విద్యార్థుల సౌకర్యార్థం మినరల్ వాటర్ ప్లాంటును ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిం చారు. అదేవిధంగా తాటికొండ గ్రామంలోని రైతువేదికలో 146మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతు న్నదని ఆయన తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ రం గంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధిని సాధించిందని తెలిపారు. సాగునీటి సౌకర్యంతో ఎంతో మెరుగుపడిందని ఆయన తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్‌లోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ఆయన తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాలమూరు జిల్లాపై ఎంతో మమకారం ఉందని ఆయన తెలిపారు. ఇందుకు ప్రధానంగా జిల్లా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మంజూరు చేయడమేనని ఆయన తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలో ప్రతి ఎకరాలకు సాగునీరందిస్తామని ఆయన తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు ఎప్పుడు ఆదరించాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో ఎంపీపీ డాక్టర్ కదిరె శేఖర్‌రెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ అశోక్ రెడ్డి, వైస్ ఎంపీపీ నరేశ్‌గౌడ్, తహసీల్దార్ చెన్నకిష్టన్న, సర్పంచ్‌లు నీలిమ, సాయికుమార్, కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ టీసీలు రజిత, సాయిలు, వెంకటేశ్వరమ్మ, కో ఆప్షన్లు ఖాజ, అజీజ్, జాకీర్, నాయకులు సత్యనారాయణ, సాయిలు, ముర ళీధర్ గౌడ్, రాము రాథోడ్, గురు, రాజారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.