భూత్పూర్: సీఎం కేసీఆర్ సలహాలతో నియోజకవర్గంలో చెక్ డ్యాం నిర్మాణాలతో మంచి ఫలితాలను సాధించామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిఅన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యంగా కోయిల్‌సాగర్ నుంచి రామన్‌పాడ్, నిజాలపూర్ నుంచి సరళాసాగర్ వరకు మొదటి ఫేజ్‌లో చెక్‌డ్యాములను నిర్మించినందు వల్ల రెండు కిలోమీటర్ల మేర నీళ్లు నిలిచినట్లు ఆయన తెలిపారు. దీంతో రైతు ఎంతో సంతోషంగా పంటలను పండించకున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా రెండవ ఫేజ్‌లో కోరిన చెక్‌డ్యాంలను మంజూరు చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. చెక్‌డ్యాంల నిర్మాణా ల వలన భూగర్భ జలాలు పెరుగుతాయని ఆయన తెలిపారు.