కల్వకుర్తి రూరల్, జూన్ 12 : సర్కారు బడుల్లోనే తెలుగు, ఇంగ్లిష్ మీడియాల్లో మెరుగైన వి ద్యను అందిస్తున్నారని గ్రామీణ ప్రాం త విద్యార్థులు సర్కారు బడులను స ద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఉ దయ్‌కుమార్ అన్నారు. బుధవారం కల్వకుర్తి మండలం మార్చాల్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం చిరంజీవి ఆధ్వర్యంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమానికి కలెక్టర్ ఉదయ్కుమార్తోపాటు డీఈవో గోవిందరాజులు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలోని సరస్వతి మాత విగ్రహం వద్ద పూజలు నిర్వహించా రు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశం లో కలెక్టర్ మాట్లాడు తూ ప్రభుత్వ పాఠశాల లో చక్కటి మౌలిక వసతులు, అనుభవజ్ఞలైన ఉపాధ్యాయులు చక్కగా సేవలందిస్తున్నారన్నారు. పాఠశాలలో ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమం ద్వారా ప లు అభివృద్ధి పనులు ని ర్వహించగా కొన్ని పను లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను గ్రామ పెద్దలు విద్యావంతులు చొరవ తీసుకొని పూర్తిచేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలను సంరక్షించుకోవడం ప్రజలందరి బాధ్యత అని గుర్తు చేశారు. పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాం, రుచికరమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థు లు ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా రాణించాలన్నారు. పదో తరగతి వార్షిక ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంపై హెచ్ ఎం ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీను, తాసీల్దార్ ఇబ్రహీం, ఎంపీడీవో వెంకట్రాములు, ఎంఈవో బాసునాయక్, ఏపీడీ చంద్రశేఖర్, ఏపీఎం శ్రీనివాసులు ఏఎంసీ మాజీ చైర్మన్ బాలయ్య, గ్రామ పెద్దలు వెంకట్‌రెడ్డి, మల్లేశ్, కృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, కృష్ణయ్య, మధన్‌మోహన్‌రావు, హెచ్ఎంలు సురేందర్‌రెడ్డి, వెంకటయ్య ఉన్నారు.