జడ్చర్ల, డిసెంబర్ 22 : సైబర్ క్రైం మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత వివరాలను ఇతరులకు ఇవ్వరాదని మహబూబ్‌నగర్ అదనపు ఎస్పీ రాములు అన్నారు. ఆదివారం జడ్చర్ల మున్సిపాలిటీలోని పాతబజార్‌లోని బొడ్రాయి, చావిడి, పాతబస్టాండ్ ప్రాంతాల్లో ఆదివారం జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి, పోలీసులు కమ్యూనిటీ కాంటా క్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బృందాలుగా ఏర్పడి కా లనీల్లో ఇంటింటికీ తిరుగుతూ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాహనాల లైసెన్స్‌లను పరిశీలించారు, ఎలాంటి పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గం జాయి, గుట్కాలు ఇతర మాదకద్రవ్యాలు ఉన్నాయా అనే వాటిపై తనిఖీలు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 34 వా హనాలను స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, వ్యక్తిగత వివరాలను ఇవ్వరాదని తెలిపారు. చిన్న పిల్లలకు ఫోన్లను ఇవ్వరాదని, ఇతర యాప్‌లను ఓపెన్ చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్‌చేసి మీ బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేయించాలని సూ చించారు. గుర్తు తెలియని వ్యక్తులకు అద్దెలకు ఇండ్లు ఇచ్చే సమయంలో వారి ఆధార్‌కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని, పూర్తి వివరాలను తెలుసుకున్నాకే అద్దెకు ఇవ్వాలని సూచించారు. చట్టవ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీ రమణారెడ్డి, సీఐ ఆదిరెడ్డి, సీఐలు, 20 మం ది ఎస్సైలు, 100మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.