మహబూబ్‌నగర్ అర్బన్, అక్టోబర్ 2 : అభివృద్ధి చేసే వారికి ప్రజలు అండగా నిలబడాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోశ్ కుమార్, కోరారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అయ్యప్పకొండ వద్ద బంజారా సేవాలాల్ మహరాజ్ విగ్రహ నిర్మాణానికి సోమవారం కలెక్టర్ రవినాయక్‌తో కలిసి ఎంపీ, మంత్రి భూమిపూజ చేశారు. అనంతరం గిరిజన భవనాన్ని ప్రారంభిం చి బంజారాలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వా త తండాలను గ్రామపంచాయతీలుగా మా ర్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ఇప్పటివరకు బంజారాల అభివృద్ధి కోసం రూ.14 కోట్లను మంజూరు చేశామన్నారు. మహబూబ్‌నగర్‌ను అ ద్భుతంగా తీర్చిదిద్దిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ప్రాణాలకు తెగించి ఉద్యమం చేశా..
తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తె గించి ఉద్యమం చేశామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జేజేఆర్ ఫంక్షన్ హాల్లో యాదవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి సతీసమేతంగా హాజరుకాగా, యాదవ సంఘం నాయకులు గుర్రపు బండిలో ఊరేగిస్తూ బోనాలతో స్వాగతం పలికారు. యాదవ సంఘం నాయకులు క్రేన్ సాయంతో ఏర్పాటు చేసిన భారీ గజమాలతో మంత్రిని సత్కరించారు. సమ్మేళనంలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తుండడంతో కులమతాలను రెచ్చగొట్టేందుకు చాలా మంది వస్తున్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలన్నారు. సమై క్య రాష్ట్రంలో యాదవుల అమాయకత్వా న్ని ఆసరాగా చేసుకొని ఓటు బ్యాంక్‌గా వాడుకున్నారని విమర్శించారు. యాదవు ల అక్షరాస్యతను పెంచేందుకు హన్వాడ మండలంలో రెండు గురుకులాలను తీసుకొచ్చామన్నారు. పేదింటి యాదవ పిల్లల పెండ్లిళ్లు నిర్వహించుకునేందుకు కన్వెన్షన్ హాల్ నిర్మించి, అందులో విద్యార్థులకు హాస్టల్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. యాదవులకు ఏకష్టం వచ్చినా అండగా ఉంటామన్నారు. అంతకుముందు తిరుమల హిల్స్‌లో రూ.2కోట్ల వ్యయంతో ఎక రా స్థలంలో నిర్మించనున్న యాదవ కన్వెన్షన్ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.
పాలమూరులో హైదరాబాద్ తరహా అభివృద్ధి
మహబూబ్‌నగర్‌ను హైదరాబాద్ తరహా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని 2, 6, 7, 8, 11, 20, 21, 23, 46వ వార్డుల్లో రూ.17.70 కోట్లతో చేపట్టిన సీ సీరోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీహాల్ నిర్మా ణ పనులకు సోమవారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. అంతకుముందు జి ల్లా కేంద్రంలోని భగీరథ కాలనీ వద్ద జరుగుతున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు.
గాంధీ స్ఫూర్తితోనే రాష్ట్ర సాధన
పాలమూరు, అక్టోబర్ 2 : మహాత్మాగాం ధీ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ అహింసా మార్గంలో రాష్ర్టాన్ని సాధించారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని గాంధీరోడ్ హైస్కూల్ వద్ద ఉన్న మహాత్ముడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు తమ బడిని బాగు చేసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కళాశాలను మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసుకున్నామని, త్వరలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల కూడా ప్రారంభించుకుందామన్నారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, సింగిల్‌విండో చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, కౌన్సిలర్లు ఆనంద్‌కుమార్‌గౌడ్, నీరజ, ప్రవీణ్,రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, గొర్రెల కాపరుల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శాంతన్నయాదవ్, శ్రీనివాస్‌యాదవ్ పీఆర్టీయూ అధ్యక్షుడు, కార్యదర్శి నారాయణ్‌గౌడ్, రాఘురాంరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు, బంజారా సేవా సంఘం అధ్యక్షుడు రాజునాయక్, బంజారా ఆలయ కమిటీ చైర్మన్ చంద్రనాయక్, ఎల్ఎన్ఎస్ మెంబర్ రమేశ్‌నాయక్, ప్రతాప్‌నాయక్ పాల్గొన్నారు