తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బేషరతుగా మహిళాలోకానికి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు డిమాండ్ చేశారు. ఆదివారం ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బండి సంజయ్ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేశారు. మహిళలనే గౌరవం లేకుండా సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. అనుచితంగా మాట్లాడిన అతడిపై బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మక్తల్ టౌన్/అర్బన్, మార్చి 12 : ఎమ్మెల్సీ కవితపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలతో విచారణ జరిపిస్తే ఇక్కడ ఎవ రూ భయపడరని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి అన్నారు. కవితపై బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మెల్యే చిట్టెం ఆదేశాల మేరకు ఆదివారం అంబేద్కర్
చౌరస్తాలో పట్టణ అధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కార్యక్రమానికి మహిపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బండి సంజయ్ కవితమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేయ డం హేయమైన చర్య అని అభివర్ణించారు. బండి పిచ్చిపట్టిన కుక్కలాగా నో టికొట్టింది వాగుతున్నారని ఆగ్రహం వ్య క్తం చేశారు. బేషరతుగా కవితమ్మకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంత రం బండి సంజయ్ దిష్టిబొమ్మను దహ నం చేశారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి బీ ఆర్ఎస్ నాయకులు మక్తల్ పోలీస్‌ష్టేషన్‌కు ర్యాలీగా వెళ్లి బండి సంజయ్‌పై వెంటనే చ ర్యలు తీసుకోవాలని కోరుతూ మక్తల్ ఎస్సై పర్వతాలుకు ఫిర్యాదు అందజేశారు. కా ర్యక్రమంలో కౌన్సిల ర్లు శ్వేతారె డ్డి, రాములు, నాయకులు ర వీందర్‌రెడ్డి, కావలి ఆంజనేయులు, కావలి తాయప్ప, రవికుమార్, కృష్ణ, ఉమాశంకర్‌గౌడ్, సాగర్, శివారెడ్డి, నర్సింహులు, వాకిటి వెంకటేశ్, నజర్, మన్నన్, సాధిక్ తదితరులున్నారు.
బండి దిష్టిబొమ్మ దహనం
మద్దూర్ (కొత్తపల్లి), మార్చి 12: కొత్తపల్లి మండలకేంద్రంలోని చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి
కోస్గి, మార్చి 12: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెం టనే క్షమాపణ చె ప్పాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షు డు హన్మంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక శివాజీ చౌరస్తాలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రానున్న రోజుల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి తదితరులున్నారు.