ఇంటింటా రామనామం.. ఊరూరా శోభాయాత్రలు.. వీ ధుల్లో జైశ్రీరాం నినాదాల జోరు.. యువత మోటర్ సైకిళ్ల ర్యాలీలు.. మహిళల కోలాటాల ప్రదర్శన.. ఇండ్ల ముంగిళ్లలో అలరించిన రంగవల్లులు.. కిక్కిరిసిన ఆలయాలు.. రామాలయాల్లో విశేష పూజలు.. వీధివీధినా అన్నదానాలు.. ఆకట్టుకునే లా చిన్నారుల వేషధారణ.. ఇలా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక పరిమళాలు విరజిమ్మాయి.

సోమవారం అయోధ్యలో బాలరాముడి విగ్ర హ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా రామనామం మార్మోగింది. రా మలల్లా ప్రాణప్రతిష్ఠ జరగగానే ప్రజలందరూ కరతాళధ్వనులతో సంతోషా న్ని వెలిబుచ్చారు. పెద్ద సైజ్లో డిజిటల్ స్క్రీన్లలో ్లపట్టాభి రాముడి వేడుకను తిలకించిన ప్రజలు తన్మయత్వం పొందారు. జై శ్రీరామ్ నినాదాలతో, పటాకుల మోతతో హోరెత్తిపోయింది. ఎక్కడ చూసినా అయోధ్య పండుగ సందడే కనిపించింది.