వెల్దండ : నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం ( Veldanda Mandal ) తో పాటు కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బక్రీద్ వేడుకలను (Bakrid Celebrations) ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లో ముస్లింలు ఈద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కల్వకుర్తిలో జరిగిన బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి (Kasireddy Narayanareddy) పాల్గొని ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. వెల్దండ మండల కేంద్రంలో సింగిల్ విండో డైరెక్టర్ మొట్ట వెంకటయ్య గౌడ్, మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి , ఇతర నాయకులు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ముస్లిం మత పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.