దేవరకద్ర, జూన్ 8 : మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట నిర్వహించారు. అనంతరం సీఆర్పీలు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ ను శనివారం పంపిణీ చేశారు.
జడ్చర్లటౌన్, జూన్ 8: రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలనుసారంగా జయశంకర్ బడిబాట కార్యక్రమం లో జడ్చర్ల మండలంలో విస్త్రతంగా కొనసాగుతున్నది. మండల పరిధిలోని గంగాపూర్, నెక్కొండ, శిఖర్గాన్పల్లి, చర్లపల్లి, గొల్లపల్లి, పోలేపల్లి గ్రా మాల్లో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా గ్రా మాల్లో ఇంటింటికెళ్లి బడిఈడు పిల్లలను సర్కారు బడుల్లోనే చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. గొల్లపల్లిలో జడ్చర్ల ఎంఈవో మంజులాదేవి బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, పాఠ్యాపుస్తకాల పంపిణీ కా ర్యక్రమాన్ని ప్రారంభించారు. జడ్చర్లలోని మ హి ళా సమాఖ్య భవనంలో శనివారం హెచ్ఎంలకు జడ్చర్ల ఎంఈవో మంజులాదేవి పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ మాల్యనాయక్, ఏపీఎం కమ్యూనిటీ కోఆర్డినేటర్ ఈశ్వర్,స్వర్ణ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్, జూన్ 8 : మండలంలోని పలు గ్రా మాల్లో శనివారం ఉపాధ్యాయులు బడిబాట నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎంలు, సీఆర్పీ లు ఇక్రమ్, ఠాగూర్, నాగేందర్ పాల్గొన్నారు.
కృష్ణ, జూన్ 8 : కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించి, మెరుగైన విద్యను అందిస్తున్నామని ఇన్చార్జ్ హె చ్‌ఎంలు శంకర్, రాంరెడ్డి అన్నారు. బడిబాట కా ర్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేద పిల్లల త ల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్ కో సం అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాల్లో చేర్పించాలని కోరారు. ఇంటింటికీ తిరుగుతూ ప్ర చారం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృషిద, శోభరాణి, అంగన్వాడీ టీచర్ కమల తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్, జూన్ 8: మండల కేంద్రంలో ఎంఈర్సీ వద్ద కేజీబీవీ బాలికల పాఠశాల, వస్పుల్, వే ముల, మిడ్జిల్, కొత్తపల్లి, కొత్తూర్, వల్లబురావుపల్లి తదితర గ్రామాల పాఠశాల ఉపాధ్యాయులకు ఎంఈవో మంజూలదేవి పుస్తకాలు అందజేశారు. 12న పాఠశాలల పునఃప్రారంభం నాటికి ప్రతి వి ద్యార్థికి ఉచితంగా పుస్తకాలు అందించాలని సూ చించారు.
ఊట్కూర్, జూన్ 08 : బడి బాట కార్యక్రమంలో భాగంగా మండలంలోని నిడుగుర్తిలో శనివారం యూపీఎస్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి బడి ప్రాముఖ్యతను గ్రామస్తులకు తెలిపారు. ఈసందర్భంగా పాఠశాల హెచ్ఎం లక్ష్మారెడ్డి మాట్లాడు తూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఫీజు లేకుండా అడ్మిషన్లు కల్పిస్తామని, ఏడాదికి ఉచితంగా రెండు జతల దుస్తులు, సన్నబియ్యంతో వండిన ఆహారాన్ని అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాద్యాయులు సలాం, పద్మ, సుజాత, సునీత, వెంకటప్ప, లియాఖత్ పాల్గొన్నారు.
నవాబ్‌పేట, జూన్ 8: మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగానే ఆ యా గ్రామాల్లో ఉపాధ్యాయులు ఇంటింటికీ తి రిగి బడీడు పిల్లలను బడిలో చేర్పించారు. లింగంపల్లిలో మాజీ ఎంపీపీ శీనయ్య ఉపాధ్యాయులతో పాటు బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. కార్యక్రమంలో హెచ్ఎం ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.