మహబూబ్‌నగర్, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అసలే సీఎం సొంత జిల్లా.. ఇ టీవల కురుస్తున్న వర్షాలకు రహదారులు కాల్వలయ్యాయి.. ఎక్కడపడితే అక్కడ గుంతలు ప డి వాహనాలకే కాదు నడవడానికి కూడా ఇ బ్బందికర పరిస్థితి ఏర్పడింది.. సాయంత్రం కా గానే ఊళ్లకు చేరుకునే దుస్థితి.. అయితే మాకేం టి.. సర్కారు చిల్లి గవ్వ ఇవ్వకుంటే మరమ్మతు లు మెమెలా చేయాలి? అని అధికారులు చేతులెత్తేశారు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షా ల వల్ల జిల్లా కేంద్రాల్లో కూడా రహదారులన్నీ దెబ్బతిన్నాయి.. మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి.. ఇక గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల గు రించి చెప్పనవసరం లేదు.. పాఠశాలకు వెళ్లే విద్యార్థుల నుంచి రోజు పట్టణాలకు వచ్చి పను లు చేసుకునే కూలీలు, కూరగాయల అమ్మే రైతుల వరకు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు.. సీఎం సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో జనం పడుతున్న అవస్థలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పట్టణం, పల్లె అనే తేడాల్లేకుండా రహదారులన్నీ పాడైపోయాయి. రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాం గ్రెస్ సర్కారు గడిచిన 8 నెలలుగా గ్రామీణ, ప ట్టణ రహదారులకు చిల్లి గవ్వ కూడా ఇవ్వకపోవడంతో మరమ్మతులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. జిల్లా కేంద్రాల్లో అయితే రహదారుల న్నీ గుంతలమయం కావడంతో జనం తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఇటీవల రహదారిపై వరి నాట్లు వేసి వినూత్నంగా నిరసన తెలిపారు. కోయిలకొండ మండలంలోని అనేక తండాలకు రహదారులు లేకపోవడంతో తండావాసుల ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ఇటీవల కొందరు రహదారులపై సర్కస్ ఫీట్లు చేస్తూ సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రహదారులన్నీ దెబ్బతినడంతో గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే మరమ్మతులకు నయా పైసా లేదని చేతులు ఎత్తేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీలకు రూ.వందల కో ట్లు కేటాయించేది. కానీ కొత్తగా ఏర్పడిన కాం గ్రెస్ ప్రభుత్వం వీటికి పూర్తిగా మంగళం పాడిం ది. ఈ నిధులన్నీ ఇతర అవసరాలకు డైవర్ట్ చే సింది. ఫలితంగా కొత్త రహదారులు వేయకపో గా ఉన్న రహదారుల మరమ్మతులను మరిచిపోయారు. సీఎం సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రం అంతటా ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రెండు ప్రధాన రహదారులు తప్పితే మిగతా ర హదారులన్నీ పరీక్షగా మారాయి. క్లాక్‌టవర్ నుంచి టీడీగుట్ట హన్వాడకు వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయంగా మారింది. తెలంగాణ చౌరస్తా నుంచి కోర్టు మీదుగా కలెక్టర్ బంగ్లా చౌరస్తా వరకు రోడ్డుపై వెళ్లాలంటేనే జనం జం కుతున్నారు. నిత్యం కలెక్టర్ ఎస్పీలతోపాటు జ డ్జీలు ఇతర న్యాయవాదులు తిరిగే ప్రధాన రహదారి అయినా పట్టించుకునే వారే లేరు. అశోక్ టాకీస్ చౌరస్తా నుంచి క్లాక్ టవర్ వరకు మున్సిపాలిటీ ఎదురుగానే రహదారి గుంతల మయం గా మారిన ఆ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఎర్రసత్యం చౌరస్తా నుంచి బోయపల్లి గేటు వరకు కూడా రహదారి పూర్తిగా గుంతలమయం అయింది.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి రాయిచూరు ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమై గుంతలమయంగా మారింది. పాలమూరు యూనివర్సిటీ నుంచి దేవరకద్ర వరకు రహదారి ఇరువైపులా రోడ్డు కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ రహదారిపై నిత్యం వేలాది వాహనాలు తి రుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ ప్యాచు లు వేసినా ఇటీవల కురుస్తున్న వర్షాలకు పాడైపోయింది. జాతీయ రహదారుల శా ఖ కాంట్రాక్టర్లు కుమ్మక్కై ఈ రహదారి వి స్తరణ సమయంలో నాసిరకం పనులు చే శారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. అయినా పట్టించుకోకుండా రోడ్డు వేయడంతో అవి ఇప్పుడు నిజమయ్యాయి. తెలంగాణ-కర్ణాటకను కలిపే హైవే ఇదే కా వడంతో ప్రయాణికులు నరకయాతన ప డుతున్నారు. ప్రమాదాలకు గురవుతున్నారు.
మహ్మదాబాద్ మండలకేంద్రం నుంచి చిన్నాయిపల్లి, మఠంలపల్లి, బండమీదిపల్లి వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల రహదారి బురదమయంగా మారింది. వర్షాలతో నడిచేందుకు కూడా ఇబ్బందిగా మారడంతో తండా విద్యార్థులు పాఠశాలలకు వెళ్లకుండా గ్రామంలోనే ఉంటున్నారు. కనీసం నడవాలన్నా ఎక్కడ కింద పడిపోతామో అన్న పరిస్థితి ఉందని, దీంతో పిల్లలను స్కూల్‌కు పంపడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. మరమ్మతులు చేయాలని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అయితే, ఈ తండాల్లో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయడానికి వచ్చిన అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ ఈ రహదారిని చూసి అవాక్కయ్యారు. ప్రజలు ఇంత అవస్థలు పడుతున్నా అధికారులు ఎందుకు మరమ్మతులు చేయడం లేదని నిలదీశారు. జిల్లాలో రహదారుల దుస్థితి వల్ల విద్యార్థుల చదువులపై కూడా ప్రభావం చూపే పరిస్థితి ఉంది.
ఇదేదో కాల్వ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. ఇది ఓ తండాకు వెళ్లే రహదారి అంటే ఆశ్చర్యం వే యక మానదు.. ఇది ఎక్కడో కాదు సీఎం సొంత జిల్లాలో ఓ తండా రహదారి పరిస్థితి.. వర్షం వ చ్చిందంటే చాలు రహదారి ఇలా కాల్వగా మారిపోతుంది. గతంలో రహదారి లేని తండాకు కేసీఆ ర్ ప్రభుత్వ హయాంలో రోడ్డు వేశారు.. అయితే ఎనిమిది నెలలుగా దీనికి మరమ్మతులు చేయకపోవడంతో ఈ రహదారి అధ్వానంగా మారిపోయిం ది. మహబూబ్‌నగర్ రూరల్ మండలం జైనల్లీపూ ర్ నుంచి లాల్యనాయక్ తండాకు వెళ్లే రెండు కిలోమీటర్ల రహదారి ఇది. ఇటీవల కురుస్తున్న వర్షాల కు ఏకంగా కాల్వగా మారిపోయింది. గతంలో తం డాకు రహదారి లేకపోతే అప్పటి కేసీఆర్ ప్రభు త్వం ఏకంగా కొత్త రోడ్డును నిర్మించింది. జిల్లా కేం ద్రం నుంచి రాకపోకలు సాగుతున్నాయి. అయితే ఈ రహదారి గురించి పట్టించుకోకపోవడంతో ఇ లా తయారైంది. తండా నుంచి జిల్లా కేంద్రానికి రావాలన్నా తిరిగి వెళ్లాలన్నా జనం అవస్థలు పడుతున్నారు. పొలం గట్ల వెంట తండాకు చేరుకుంటున్నారు. రాత్రిళ్లు ప్రయాణించాలంటే భయంతో వణికిపోతున్నారు.
కాంగ్రెస్ సర్కారు కొలువుదీరి ఎనిమిది నెలలు అవుతున్నా ఉమ్మడి జిల్లాలో మంత్రి, ఎమ్మెల్యేలు రహదారుల మరమ్మతులను పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఏకైక మంత్రి జూప ల్లి కృష్ణారావు తన సొంత నియోజకవర్గంలోని రహదారులు పాడైనా పట్టించుకున్న పాపాన పోలేదు. మిగతా ఎమ్మెల్యేలు కూడా వారి నియోజకవర్గాల్లో అస్తవ్యస్తంగా మారిన రోడ్లను పట్టించుకోవడమే లేదనే ఆరోపణలు ఉ న్నాయి. మరోవైపు 6 గ్యారెంటీలు అమలు చేయకపోవడం.. రైతు భరోసా, రుణమాఫీ అర్హులకు ఇవ్వకపోవడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగలేక పో తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో పర్యటించి హడావిడి చేశారే తప్పా.. రోడ్ల కో సం నయా పైసా విదిల్చలేదు.