
ఇటిక్యాల/అలంపూర్, డిసెంబర్ 17 : మానవాళి మనుగడకు జీవనాధారమైన నదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని డీపీవో శ్యాంసుందర్ సూచించారు. ఆజాదీకా అ మృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద, అలాగే అలంపూర్ మం డలం గుందిమల్ల, ఊట్కూరు, భీమవరం, క్యాతూరు గ్రామ శివారుల్లోని కృష్ణానదిలో నదీ ఉత్సవ్ శ్రమదా నం చేపట్టారు. నదీతీర ప్రాంతాలను శుభ్రం చేశారు. నదిలో పేరుకుపోయిన చెత్తా చెదారం, ప్లాస్టిక్ వస్తువు లు తొలగించారు. నది ప్రాముఖ్యత తెలియజేసేలా ర్యా లీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీ నేతృత్వంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. నదీ జలాలను పవిత్రంగా భావించి ప్రతి ఒక్కరూ నదులను శుభ్రంగా ఉంచేందుకు తమవంతు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమం 27వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమాల్లో అలంపూర్, ఇటిక్యాల ఎంపీడీవోలు సుగుణకుమార్, రవీంద్ర, ఎంపీవో భాస్కర్, సర్పంచ్ నర్సమ్మ, పంచాయతీ కార్యదర్శి వినోద్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, గ్రామ కార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.