బాలానగర్, డిసెంబర్ 11 : నియమ నిష్టలతో చేసే అ య్యప్ప దీక్ష.. మనిషి ప్రవర్తన మార్పు తీసుకువస్తున్నది. మండల కాలం 41 రోజులపాటు దీక్షలో ఉన్న భక్తులు.. దీ క్ష తర్వాత కూడా దుర్గాణాలను వదిలి, సన్మార్గంలో నడిచే లా చేస్తున్నది. పరమ పవిత్రమైన అయ్యప్ప దీక్ష తీసుకునే భక్తుడినే దేవుడిగా భావిస్తుంటారు. దీక్షలో ఉన్న వారు రో జుకోసారి మధ్యాహ్నం మాత్రమే భిక్ష(భోజనం) చేస్తారు. మాలధారులకు భిక్ష పెట్టడానికి చాలా మంది తహతహలాడుతుంటారు. స్వాములను ఇంటికీ పిలిచి భిక్ష పెడితే సా క్షాత్తు అయ్యప్పస్వామిని ఇంటికీ వచ్చి తిన్నట్లుగా భావిస్తా రు.
అయ్యప్ప మాలధారులు 41 రోజులపాటు సుచిగా.. పవిత్రంగా తయరు చేసే భిక్ష తినాలి. ఇంట్లో ప్రతిరోజు త యారు చేసుకోవడం కాస్త కష్టమైన పని, ఒక్కోసారి కుదరకపోవచ్చు, అందుకోసం దీక్ష తీసుకున్న భక్తులు ఆలయా లు, పడిపూజలు నిర్వహించే వద్దకు వెళ్తుంటారు. మండలంలోని పెద్దాయపల్లి గ్రామ శివారులోని అయ్యప్పస్వామి ఆలయంలో నిత్యాన్నదానం సాగుతున్నది. సంక్రాంతి జ్యో తి దర్శనం వరకు అన్నదాన కార్యక్రమం కొనసాగుతూ ఉం టుంది. స్వాములకు భిక్ష ఏర్పాటు చేయడంలో అయ్యప్ప అన్నదాన సేవా సమితి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నది.
అయ్యప్ప అన్నదాన సేవా సమితి పెట్టే భిక్ష అంటే స్వా ములకు ఎంతో ఇష్టం. సాంబార్, పెరుగు, రెండు కూరగాయలు, చట్నీ, అప్పడాలు, ఒక మిర్చి, స్వీటు వంటి వాటి తో నిత్యాన్నదానం చేస్తారు. ప్రతి బుధవారం భజన కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతిరోజు 250 నుంచి 300 మంది అయ్యప్ప భక్తులకు భిక్ష అందజేస్తారు. మండలం కేంద్రంతోపాటు చుట్టు పక్కాల నుంచి అయ్యప్ప మాలధారులు ఇక్కడికి వచ్చి భిక్ష చేస్తారు. 10 ఏండ్ల నుంచి ఉచిత అన్నదాన సేవలు కొసాగుతున్నాయి.
అయ్యప్పస్వామి ఆలయంలో నిత్యాన్నదానం కోసం మొదటగా రూ.6 వేలు, రూ. 8 వేలు, ఇప్పుడు రూ.10వేలతో నిత్యాన్నదానం చేస్తున్నారు. ప్రతిరోజు 300 మందికి భిక్ష ఏ ర్పాటు చేస్తారు. మధ్యాహ్నం 12.30 నుంచి 3 గంటలకు భిక్ష (భోజనం) అందుబాటులో ఉంటుంది. ప్రతి ఏటా 41 రోజులపాటు భిక్ష పెడుతున్నారు. ఆలయ నిర్వాహణ అధికారి స్టేషన్ శ్రీనివాసులు గురుస్వామి ఆధ్వర్యంలో ప్రతిరోజు మాలధారుల వద్ద నుంచి అన్ని ఏ ర్పాట్లు చేస్తూ ఎలాంటి ఇబ్బంది రావొద్దనే ఉ ద్దేశంతో నిత్యాన్నదానాకి శ్రీకారం చుట్టారు. ఆలయం వద్ద స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.
నాణ్యతలో ఏ మా త్రం రాజీపడకుండా స్వాములకు భిక్ష ఏర్పాటు చే స్తున్నాం. ప్రతిరోజు 11 రకా ల వెరైటీలు కచ్చితంగా ఉం టాయి. విస్తార్లు మొదలు ..తాగేనీటి వరకు ప్రతి విషయంలో స్వాముల ఆరోగ్యానికి దృష్టిలో పెట్టుకొని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తు న్నాం. ప్రతిరోజు 300 మంది వచ్చినా ఎలాంటి ఇబ్బం ది లేకుండా భిక్ష ఏర్పాటు చేయగలం. అయ్యప్ప భక్తుడిగా ఇదో బాధ్యతగా తీసుకొని కృషి చేస్తున్నాం.
– స్టేషన్ శ్రీనివాసులు గురుస్వామి,
ఆలయ నిర్వాహణ అధికారి మండలం
భిక్షకు వచ్చే వారి కో సం అద్బుతమైన వసతు లు ఉన్నాయి. ప్రతీది సిస్టమెటిక్గా జరుగుతున్నది. మె యింటనెన్స్ బాగుంటుంది. అందుకే వేరే దగ్గరకు వెళ్లడం కంటే ఇక్కడికి వచ్చి భిక్ష చే యడమే నచ్చుతున్నది. అ య్యప్ప భక్తుల కోసం సేవా సమితి ప్రతిరోజు భిక్ష పెట్టడం గొప్ప విషయం.
– నర్సింహులు, గురుస్వామి గుండేడ్