మాగనూరు, జూలై 5 : ఆటోడ్రైవర్ల సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ హామీ మేరకు రూ.12వేలు ఆర్థికభృతి ఇవ్వాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం మాగనూరులో ర్యాలీ నిర్వహించి తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఆటో డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా సహాయ కార్యదర్శి గోవిందరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆటోడ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.
గిరాకీలు లేకపోవడంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందన్నారు. ఆటోడ్రైవర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాసీల్దార్ నాగలక్ష్మికి అందజేశారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు బస్వరాజ్, తిమ్మప్ప, వాబయ్య, శ్రీకాంత్, రాజేందర్‌గౌడ్, వెంకటేశ్, శ్రీకాంత్, రవి, భీంరాజ్, నర్సింహులు, నరేశ్, మారెప్ప తదితరులు పాల్గొన్నారు.