ఆటో డ్రైవర్లపై పోలీసుల నిర్బంధం కొనసాగింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆటో కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డగించారు. ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లను ముందస్తుగా అరెస్టు చేసి ఆయా పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఆటో డ్రైవర్లకు గిరాకీ లేకుండా చేసి కడుపుకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు వారీగా ఫైనాన్స్ డబ్బులు కట్టలేకపోతున్నామని, మాకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపించాలన్నారు. ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని కోరారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అక్రమ అరెస్టులు ఎన్ని చేసినా ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం సాయంత్రం సొంత పూచీకత్తుపై నాయ కులను విడుదల చేశారు. ఆటో డ్రైవర్ల అరెస్టును కార్మిక సంఘాలు ఖండించాయి.
– నెట్వర్క్ మహబూబ్నగర్, డిసెంబర్ 20