మల్దకల్,ఏప్రిల్ 11 : జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం లో ఇటీవల ట్రాన్స్ జెండర్ చేతిలో ఆటో డ్రైవర్ మృతిచెందిన సంగతి మరవక ముందే మళ్లీ ట్రాన్స్ జెండర్ చేతిలో మరొకరు బలి అయిన ఘటన శుక్రవారం మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. గ్రామానికి కొత్త కుర్వ రామకృష్ణను ట్రా న్స్ జెండర్లు హత మార్చి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తుల కథనం మేరకు గ్రామానికి చెందిన కుర్వ రామకృష్ణ (24) గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన శివాణి అనే ట్రాన్స్‌జెండర్‌తో రెండేండ్లుగా కలిసిమెలసి తిరుగుతుండేవారన్నారు.
కాని ఇటీవల కొద్ది రోజులుగా రామకృష్ణ ట్రాన్స్‌జెండర్ శివాణి ఫోన్ చేసిన లిప్ట్ చేయకపోవడంతో రగిలిపోయిన శివాణి మరో ముగ్గురితో కలిసి శుక్రవారం ఉదయం మల్దకల్ గ్రామానికి చేరుకున్నారు. రామకృష్ణ భార్య, కుటుంబ సభ్యులు ఓ పెండ్లి వెళ్లగా రామకృష్ణ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఈ సమయం లో ట్రాన్స్ జెండర్ శివాణితో పాటు వచ్చిన మరో ముగ్గురు ట్రాన్స్ జెండర్లు ఇంట్లోకి ప్రవేశించి తలుపులు మూసి యువకుడి నోట్లో బట్టలు కుక్కి అతడిపై విచక్షణ రహితంగా దాడి చేసి గొంతు నులమడంతో ఆపస్మారక స్థితిలోకి వెళ్లాడన్నారు. దీంతో వారు రామకృష్ణను జిల్లా కేంద్రంలోని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ దవాఖాన తరలించి అక్కడి నుంచి ట్రాన్స్జెండర్లు పరారైనట్లు తెలిపారు.
ట్రాన్స్ జెండర్ల నిర్వాకంతో తమ కుటుంబ పెద్ద దిక్కును కోల్పొయామని తమకు దిక్కెవరని రామకృష్ణ భార్య కృష్ణవేణితోపాటు కుమారులు, బంధువుల ప్రభుత్వ దవాఖాన వద్ద ఆందోళన చేపట్టారు. రామకృష్ణ ఉరేసుకుంటే తమ ఇంట్లోనే శవం ఉండాలని గద్వాల దవాఖానకు ఎవరు తరలించారని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులు లేనిదే శవం ఇక్కడకి ఎలా వచ్చిందన్నారు.
రామకృష్ణను ట్రాన్స్జెండర్లు చంపి ఇక్కడికి తెచ్చారని ఆరోపించారు. తమకు న్యాయం జరగాలంటే ట్రా న్స్‌జెండర్లు తమ ముందుకు రావాలని వారు వచ్చే వరకు పో స్టుమార్టం నిర్వహించొద్దని అడ్డుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ పూజయ్య వివరాల మేరకు రామకృష్ణది అనుమానాదస్పద మృతి కింద కేసు నమోదు చేశామన్నారు. భార్య కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. దవాఖానకు వెళ్లి చూడగా గొంతుపై నల్లని గాట్లు ఉన్నాయన్నారు. హిజ్రా శివాణి మరో ముగ్గురు హిజ్రాలు తనభర్తను చంపి వేశారని ఆనుమానం ఉందని ఫిర్యాదు చేసిందన్నారు.