అలంపూర్, మార్చి 6: మండలంలోని లింగనవాయికి చెందిన ఇంటర్ విద్యార్థి ఎస్కే సమీర్‌కు గురువారం దుఃఖ పరీక్ష ఎదురైంది. అలంపూర్ మండలంలోని లింగనవాయికి చెందిన మహబూబ్‌బాషా కుమారుడు సమీర్ దేవరకద్ర కళాశాల వసతిగృహంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
రెండోరోజు గురువారం ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. విద్యార్థి తండ్రి చనిపోయాడని పిడుగు లాంటి వార్త వినాల్సి వస్తుందని కళలో కూడా ఊహించలేదు. అయినా గుండె నిబ్బరంతో భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని అధ్యాపకుల సూచనలు మేరకు పరీక్షకు హాజరయ్యాడు. ప రీక్ష ముగిసిన తర్వాత తెలుగు పండుతుడైన శ్రీనివాసులు విద్యార్థి సమీర్‌ను బైక్‌పై తీసుకొచ్చి లింగనవాయిలో వదిలి పెట్టాడు. బంధువులతో కలిసి విద్యార్థి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. ఈ వార్త సోషల్‌మీడియాలో వైరలైంది. విద్యార్థి సమయస్ఫూర్తి, అధ్యాపకుల సహాయాన్ని పలువురు మెచ్చుకున్నారు.