అభం శుభం తెలియని చిన్నారులను సైతం మా నవ మృగాలు వదలడం లేదు.. తోటి పిల్లలతో సరదాగా ఆడుకుంటూ వెళ్లిన మూడేండ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించడంతోపాటు గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించిన ఘటన మహబూబ్‌నగర్‌లో చోటుచేసుకున్నది. విషయం దావణంలా వ్యాపించడంతో ఉమ్మడి జిల్లా ఉలిక్కిపడింది.
అక్కడే ఆడుకుంటున్న తోటి చిన్నారులు గమనించి సమీపంలో ఉన్న మెడికల్ కళాశాల స్టూడెంట్లకు విషయం తెలుపడంతో చిన్నారి బతికి బయటపడిం ది. లేదంటే మానవమృగం చేతిలో శవంగా మారేది. కాగా, చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడు పిస్తాహౌస్‌లో పనిచేస్తుండగా, వారి సూచన మేరకు అతడిని కాపాడేందుకు ఖాకీలు ప్రయత్నించడం కొనసమెరుపు.
మహబూబ్‌నగర్, నవంబర్ 3 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పిస్తాహౌస్ సమీపంలోని పార్కులో మూడేళ్ల బాలిక తోటి బాలబాలికలతో కలిసి ఆడుకుంటున్నది. పక్కనే పిస్తాహౌస్‌లో పనిచేస్తున్న వెస్ట్ బెంగాల్‌కు చెందిన 20 ఏండ్ల రిజ్వాన్ ఆదివారం మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో పార్కుకు వచ్చి బాలికను పార్కు పక్కకు తీసుకెళ్లాడు. బాలిక భయపడుతుండగానే లైంగికదాడికి ఒడిగట్టే ప్రయత్నం చేశాడు. బాలిక ఏడుపును చూసిన తోటి పిల్లలు బయట ఉన్న మెడికల్ కాలేజీ విద్యార్థులకు చెప్పడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు.
కాగా, అప్పటికే రిజ్వాన్ బాలిక గొంతు నులిమే ప్రయత్నం చేస్తుండడంతో వారు బాలికను రక్షించి యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. పార్కు పక్కనే ఉన్న బాలిక తండ్రి ఈ ఘటన చూసి నిర్ఘాంతపోయారు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు గుమిగూడడంతో పిస్తాహౌస్‌లో పనిచేసే దాదాపు 15మంది రిజ్వాన్‌కు అండ గా నిలబడ్డారు. హోటల్ యాజమాన్యానికి విష యం తెలుపడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రిజ్వాన్‌ను కాలనీవాసుల నుంచి అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
రిజ్వాన్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు బాలికపై లైంగికదాడి యత్నానికి ఒడిగట్టిన అంశంపై కేసు నమోదు చేయడానికి తాత్సారం చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది. మధ్యాహ్నం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్న బాధితులతో పోలీసులు రిజ్వాన్‌కు మతిస్థిమితం లేని వాడిగా కనిపిస్తున్నాడని చెప్పగా, మతిస్థిమితం లేని వ్యక్తులను హోటల్లో ఎలా పనిచేయించుకుంటున్నారని ప్రశ్నించడంతో విచారణ చేయిస్తామని బుకాయించి బాధితులను అక్కడి నుంచి పంపించారు.
చివరికి నిందితుడు వెస్ట్ బెంగాల్‌కు చెందిన వాడిగా గుర్తించి అక్కడ ట్రీట్మెం ట్ చేసుకున్న కొన్ని ప్రిస్క్రిప్షన్లను చూపించే ప్రయ త్నం చేశారు. దీంతో బాధితులు ఆవేదనతో వెనుదిరిగి జరిగిన ఘటనను మీడియాకు వివరించారు. అప్పటికే ఈ విషయం జిల్లా కేంద్రం లో దావనంలా వ్యాపించడంతో పోలీసులు సాయంత్రం 6గంటల తర్వాత బాధితులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కేసు నమోదు చేశారు.
పిస్తాహౌస్ సమీపంలోని పార్కులో బాలికపై లైంగికదాడికి యత్నించిన నిందితుడిపై పోక్సో కేసు నమో దు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ గాం ధీనాయక్ మీడియాకు వివరించారు. నిందితుడు పిస్తాహౌస్‌లో పనిచేస్తున్నాడని, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామన్నారు.
మధ్యాహ్నం భోజనం చేసి పక్కనే ఉన్న పార్కులో ఆడుకుంటా వెళ్లిన కొద్దిసేపటికే తన కూతురిని చూడరాని స్థితిలో చూసి భయపడిపోయాను. మూడేళ్ల బాలికపై ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి. పోలీసులు కేసును త ప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ యువకుడు కొద్ది రోజులుగా అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు తెలిసింది. పోలీసు ఉన్నతాధికారులు మరో బాలికకు ఇలాంటి దారుణం జరగకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలి. – బాలిక తండ్రి