నాగర్కర్నూల్ : తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అల్లుడి ( Son-in-law ) తో కొనసాగిస్తున్న వివాహేతర సంబంధానికి ( Extra-marital relationship) అడ్డువస్తున్నాడనే కారణంతో తాళీ కట్టిన భర్తను భార్య ( Wife ) హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది, గ్రామంలో అమ్మపల్లి యాదయ్య, అలివేలు దంపతులు.
అలివేలుకు సొంత అల్లుడు ఆంజనేయులతో వివాహేతర సంబంధాని తెలుసుకున్న భర్త యాదయ్య భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఈ నెల 23న యాదయ్య ఇంట్లో మృతిచెందాడు. అనారోగ్యంతో మృతి చెందాడని భార్య కుటుంబ సభ్యులను , గ్రామస్తులను నమ్మించింది. అంత్యక్రియలకు ముందు శవానికి స్నానం చేయించి దుస్తులు మారుస్తుండగా శరీరంపై గాయాలు కనిపించడంతో అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి సోదరుడి కుమారుడు పరశురాములు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు విచారణ చేపట్టి ప్రశ్నించగా.. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో అతని మర్మాంగాలపై దాడి చేసి హత్య చేసినట్లు నిందితురాలు , భార్య అలివేలు అంగీకరించింది. అదే రోజు కూతురు, అల్లుడు కూడా ఇంటికి వచ్చి వెళ్లిన నేపథ్యంలో వారి పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.