మహబూబ్‌నగర్, మే 26 : పాలమూరు జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున ఎస్పీ కార్యాలయం , డీఎస్పీ కార్యాలయం, టుటౌన్ పోలీస్‌స్టేషన్ కూతవేటు దూరంలో ఉన్న తెలంగాణ చౌరస్తా వద్ద మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ఏటీఎం సెంటర్లోకి చొరబడి స్టేట్‌బ్యాంక్ ఏటీఎం మిషన్‌ను బొలెరో వాహనంలో ఎక్కించి యథేచ్ఛగా ఎ త్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వివరాల ప్రకారం తెలంగాణ చౌరస్తాలో తెల్లవారుజామున 2:25 గంటల సమయంలో గుర్తుతెలియని దొంగలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎంను ధ్వంసం చేసి మిషన్‌ను తాళ్లతో కట్టి వాహనంలోకి ఎక్కించి ఎత్తుకెళ్లారు.
తెలంగాణ చౌరస్తాలోని టీఎన్జీవో భనవం రాఘవేంద్ర సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న ఏటీఎంను లక్ష్యంగా చేసుకున్న దుండగులు ముందుగా అక్కడి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం ఏటీఎంను పగులగ్గొట్టి బొలెరో వాహనంలో తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం ఘటన వెలుగులోకి రావడంతో బ్యాంక్ అధికారులు ఘట నా స్థలానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న టుటౌన్ సీఐ ఇజాజుద్దీన్ అక్కడికి చేరుకొని పరిశీలించారు.
ఇటీవల షాద్‌నగర్‌లో జరిగిన ఏటీఎం దొంగతనంలో పాల్గొన్న ముఠానే ఈ ఘటనను పా ల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నా రు. క్లూస్ టీం సహకారంతో సీసీ టీవీ పుటేజ్‌లు, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై ఎస్పీ జానకి స్వయంగా ఘట నా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సీసీ టీవీ దృశ్యాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 2:25 గంటల సమయంలో దొంగలు బొలెరో వాహనంలో వచ్చి ఏటీఎంను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. తరువాత హన్వాడ మండలంలోని కొత్తపేట సమీపంలో ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని లక్షల నగదును దొచుకెళ్లినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల ముఠా కోసం గాలింపు చర్యలు ము మ్మరం చేశారు.
కరువైన పోలీసుల నిఘా..
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎస్పీతో పాటు డీఎస్పీ, సీఐ, ఎస్సైలు, టుటౌన్ పోలీస్‌స్టేషన్ ఉన్నా ప్రాంతంలో ఏటీ ఎం సెంటర్లోకి దుండగులు చొరబడి ధ్వం సం చేసి మిషన్‌ను వాహనంలో ఎత్తుకెళ్తున్నా పోలీసులు నిఘా ఏమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరంతరం పెట్రోలింగ్ కోసం పోలీసు వ్యవస్థకు పెట్రో ఇన్నావా కార్లు, బైక్ లు ఉన్నప్పటికీ రాత్రిపూట నిఘా పెట్టకుండా నిర్లక్ష్యం వ్యవహరించడంతోనే దొంగలు రాత్రిపూట సంచరిస్తూ యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. ఇలాంటి చోరీ జరిగిన పోలీసులు అప్రమత్తంగా ఉండకపోవడంపై పలు విమర్శలు తావిస్తుంది.