నారాయణపేట టౌన్, జూన్ 6 : వరంగల్ జిల్లా హన్మకొండలో జరుగుతున్న 10వ తెలంగాణ సీనియర్స్, కిడ్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పేట జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటి 12 పతకాలు సాధించారు. అండర్-8 విభాగం 150 మీటర్ల పరుగుపందెంలో మహేశ్ సిల్వర్ మెడల్, 50 మీటర్ల పరుగుపందెంలో వరుణ్ సిల్వర్ మెడల్ సాధించారు. అండర్-10 విభాగం లాంగ్‌జంప్‌లో భరత్ గోల్డ్‌మెడల్, లాంగ్‌జంప్‌లో మౌలాలి సి ల్వర్ మెడల్ సాధించగా లాంగ్ జంప్‌లో పార్వతి బ్రాంజ్ మెడల్‌తోపాటు 50 మీటర్ల పరుగు పందెంలో సిల్వర్ మె డల్ సాధించింది. అండర్-12 విభాగం లాంగ్‌జంప్‌లో విష్ణు బ్రాంజ్ మెడల్ సాధించగా, అండర్-14 విభాగం 400 మీటర్ల పరుగుపందెంలో బసంత్ గోల్డ్ మెడల్ సా ధించాడు. అండర్-20 విభాగం 100 మీటర్ల పరుగుపందెంలో అరవింద్ సిల్వర్ మెడల్ సాధించారు. మెన్స్ విభా గం హైజంప్‌లో జనార్దన్ గోల్డ్ మెడల్‌తోపాటు 110 మీట ర్ల హడిల్స్లో సిల్వర్ మెడల్ సాధించాడు. పతకాలు సా ధించిన క్రీడాకారులను తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేష న్ సెక్రటరీ సారంగపాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ, కోచ్‌లు జగదీశ్, శ్రీలత, రాజు అభినందించారు.