వెల్దండ : మండల పరిధిలోని కొట్ర గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న చెన్నకేశవ స్వామి ఆలయానికి ( Chenna Kesava Swamy Temple) కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన యువ నాయకుడు కాయితి ఆశాదీప్ రెడ్డి రూ. 1,00,116 నగదు విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఆశాదీప్ రెడ్డికి ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాములు, నాయకులు షాంపూరి అల్లాజీ, నీరటి శ్రీను, జంగయ్య, శివ తదితరులు పాల్గొన్నారు.