అలంపూర్, జనవరి 10 : చాలీచాలని జీతాలతో కుటుంబాలు గడవడం కష్టమైంది.. అసెంబ్లీలో మా బాధలు చె ప్పి వేతనాలు పెంచడంతోపాటు మా సమస్యలు పరిష్కరించేలా చూడండి సారూ అంటూ ఆశ కార్యకర్తలు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుకి తమ బాధలను మొరపెట్టుకున్నారు. శుక్రవారం అలంపూర్ చౌరస్తాలోని క్యాంప్ కా ర్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆశకార్యకర్తలు మాట్లాడుతూ ఏఎన్ఎం శిక్షణ పూర్తి చేసిన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్ అమలయ్యేలా చర్యలు చేపట్టాలని కోరారు. నెలకు రూ.18 వేల వేతనంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.