మక్తల్ టౌన్, మే 28 : తెలంగాణ క్రీడా ప్రాంగణాలను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని మున్సిపల్లో 4వ వార్డులో లింగేశ్వరస్వామి ఆలయం పక్కన చేపట్టిన తెలంగాణ క్రీడా ప్రాం గణం ఏర్పాటుకు స్థలం శనివారం పరిశీలించి పనులు త్వ రగా పూర్తి చేయాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి వార్డు లో వార్డుకు సంబంధించిన ప్రత్యేక అధికారులతో కలిసి చే పట్టాల్సిన పనులు తెలుసుకొని నిర్దేశించిన సమయం ప్ర కారం పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రతి వార్డులో రూ.4.50లక్షలతో క్రీడా ప్రాంగణం చేపట్టామన్నారు. అం దులో కబడ్డీ, ఖోఖో, లాంగ్ జంప్, హై జంప్, వాలీబాల్ తదితర వంటి క్రీడలు నిర్వహిస్తామన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నర్సింహ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న జూనియర్ కళాశాల మైదానం, 4వ వార్డులో తెలంగాణ క్రీడా ప్రాంగ ణం ఎమ్మెల్యేతో ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఏ ఈ నాగశివ, కౌన్సిలర్ సత్యనారాయణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పదవులు శాశ్వతం కావు అని, టీఆర్ఎస్ కోసం పని చేసే వారందరిని పార్టీ గుర్తిస్తుందని ఎమ్మెల్యే చిట్టెం అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్‌గౌడ్ పదవీ కాలం పూర్తి కావడంతో మార్కెట్ కమిటీ రద్దు కావడంతో ఎమ్మెల్యేను మార్కెట్ కమిటీ సభ్యులు మ ర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల కోసం సేవ చేసిన మార్కెట్ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా నిరంతరం పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్‌చైర్మన్ అనిల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, డైరెక్టర్లు శాలం, అశోక్, శివ, రవికుమార్, బుడ్డప్ప, మజర్, రాజు తదితరులు పాల్గొన్నారు.