బాలానగర్, నవంబర్ 14 : మండల కేంద్రంలోని జాతీ య రహదారి-44పై ఉన్న చావురాస్తా రూపురేఖలు మారబోతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది అమాయకుల ప్రాణాలు బలిగొన్న కూడలి వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి అధికారులు శ్రీకారం చుట్టారు. మొత్తమ్మీద పై వంతెన నిర్మా ణ పనుల్లో కదలిక వచ్చింది.
నిర్మాణంలో భాగంగా ముం దుగా ట్రాఫిక్‌ను దారి మళ్లించే పనులు ప్రారంభమయ్యాయి. ఇటు బెంగళూరు.. అటు హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల కోసం బాలానగర్‌లో హైవే అనుసంధానంగా ఉన్న సర్వీస్ రో డ్లపై నుంచి వాహనాలను మళ్లించారు. వేగంగా వెళ్లకుండా ఉండేలా సర్వీసు రోడ్లపై పలుచోట్ల స్పీడ్ బ్రేకర్లు వేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు సర్వీసు రోడ్లను అనుసరించి ఏర్పాటు చేసిన అల్పాహారం బండ్లు, పండ్లు, పూలు వంటి వ్యాపార సంబంధమైన తోపుడు బండ్లను తొలగించారు.