వెల్దండ : ఇందిరమ్మ ఇండ్లను( Indiramma Houses) ధనికులకు, కాంగ్రెస్ కార్యకర్తలకే (Congress Workers) కేటాయిస్తున్నారని బీఆర్ఎస్ వెల్దండ మండల నాయకుడు జంగిలి ప్రవీణ్ ఆరోపించారు. నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
గుడిసెల్లో ఉంటున్న పేదవారికి ఇల్లు కేటాయించక పోవడం అన్యాయమన్నారు. మండలంలో అర్హులకు ఇండ్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు కేటాయించడంపై మండిపడుతూ ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు. అనర్హులను తొలగించి అర్హులకు ఇండ్లు మంజూరు చేయకపోతే ఎంపీడీవోతో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.