Ration Cards | మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మార్చి 2 : సరైన తిండి లేక ఆకలి, అనారోగ్యాలతో ఎంతో మంది నిరుపేదలు అ ల్లాడుతున్నా.. ప్రజాపాలన ప్రభుత్వం పట్టించుకోవడం లే దు. ‘సంక్రాంతి తర్వాత గ్రామసభలు నిర్వహించి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని.. ప్రస్తుతం కార్డుల్లో పేరు ఉన్న ఒక్కో లబ్ధిదారుడికి 6కిలోల చొప్పున సన్నబియ్యం అందజేస్తామని ప్రకటించినా.. కొత్త రేషన్‌కార్డుల జారీపై సందిగ్ధం నెలకొన్నది. ఇస్తారో, ఇవ్వరో, ఎప్పుడిస్తారో అనే స్పష్టత కొరవడింది. రేషన్ కార్డుల జారీలో ఈసారి ప్ర భుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
360 డి గ్రీ సాప్ట్వేర్ సాయంతో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఆదాయ వివరాలను ఆధార్‌కార్డు సాయంతో పూర్తిగా స్కాన్ చేస్తున్నారు. వారికి కారు ఉన్నా, ప్లాట్లు, ఇళ్లు ఉన్నా స్పష్టంగా తెలుస్తుంది. ఆదాయ వనరులు ఎక్కువగా ఉన్న దరఖాస్తుదారులను అధికారులు తిరస్కరణ జాబితాలో ఉంచుతున్నారు. దీంతో వారికి కార్డులు పొందే అవకాశాలు లేకుండా పోతున్నాయి. చాలా మంది పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు ప్రభుత్వం చేసే లె క్కించే ఆదాయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు మార్చి కొత్త కార్డులు మంజూరు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
జిల్లాలో కొత్తగా 13,353 కుటుంబాలకు మాత్రమే రేషన్‌కార్డులు మంజూరయ్యాయి. 23,038 మంది పేర్లు నమోదు అయ్యాయి. వీరికి నెలకు ఆరు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందించనున్నారు. పెరిగిన వాటితో కలిపి జిల్లాలో 2,53,229 కార్డులు ఉన్నాయి. 8,16, 588 మంది సభ్యులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26న నాలుగు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 17 మండలాలు ఉండగా, 17 గ్రామాలను ఎంపిక చేసి ఫిబ్రవరి నెలలో 376 కుటుంబాలకు మాత్రమే కొత్తకార్డులు జారీ చేస్తూ ప్రొసీడింగ్స్ ఇచ్చారు.
ఆ గ్రామాల్లో వా రికే కార్డులు జారీ చేశారు. రేషన్ కార్డుల కోసం, ఉన్న కా ర్డుల్లో పేర్లు చేర్పించాలని ఇది వరకు మీ సేవ కేంద్రాల్లో ద రఖాస్తు చేసుకున్నారు. గతేడాది నవంబరులో నిర్వహించిన కుల గణనలో, ఈ ఏడాది జనవరిలో నాలుగు రోజులపాటు నిర్వహించిన గ్రామసభలో మొత్తం 99,965 దరఖాస్తులొచ్చాయి. మార్చి నెల కోటా కింద కొత్తగా 13, 355 కార్డులు జారీ చేయగా.. ఏఎఫ్ఎస్సీ కార్డు ఒకటి, ఏ ఏపీ కార్డు ఒకటి తొలగించారు. మిగిలిన దరఖాస్తులన్నీ ప రిశీలన ప్రక్రియ దశలోనే ఉన్నాయి.
ఫిబ్రవరి నెలలో జిల్లాలో మొత్తం 2,39,875 రేషన్ కార్డులుండగా, 7,93,550 మంది లబ్ధిదారులున్నా రు. ఈనెల మార్చి కోటా కింద విడుదల చేసిన కేటాయింపులో మొత్తం కార్డులు 2,53,229 ఉండగా, 8,16,588 మంది లబ్ధిదారులున్నారు. ఫిబ్రవరి నెలలో ఏఎఫ్ఎస్సీ కార్డులు 19,040 ఉండగా, యూనిట్లు 53,395 ఉన్నాయి. మార్చిలో 19, 039 కార్డులుండగా, 53,255 యూనిట్లున్నాయి. అంటే 140 యూనిట్లు కోత పెట్టారు.
ఏఏపీ కా ర్డులు ఫిబ్రవరిలో 201ఉండగా 242 యూనిట్లకు మా ర్చిలో ఒక కార్డు, ఒక యూనిట్ తగ్గించారు. మార్చి నెల కోటా కింద ఏఎఫ్ఎస్సీ కార్డులు 13,355 మాత్రమే పెంచారు.
పేదలకు అండగా నిలవాల్సిన ఈ పథకానికి సంబంధించి ఏడాదికిపైగా ఎలాంటి కార్యకలాపాలు లేకుండాపోయాయి. ప్రజాపాలన, కులగణన, మీసేవ కేంద్రాల్లో లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. కానీ ఎంపిక ప్రక్రియ మాత్రం చేపట్టడం లేదు. ప్రతి నెలా కడుపునింపుకునేందుకు కూసింతకూడు వ స్తుందన్న ఆశతో ఏడాదిగా అర్హత ఉన్న పేదలు నిరీక్షిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో ప్రాథమిక కసరత్తు కూడా చేయకపోవడం నిరుపేదల పాలిట శా పంగా మారింది. ప్రజాపాలన, కు టుంబ సర్వే కార్యక్రమాల్లో వేలాది మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు లు సమర్పించి ఎదురుచూస్తున్నారు. వీ రందరూ కార్డుల కోసం నిరీక్షిస్తున్నా ప్ర భుత్వం ఎందరికీ జారీ చేస్తుందోనన్న ఆం దోళన వ్యక్తమవుతోంది.
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి జారీ చేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు మంజూరు చేస్తాం.