గద్వాలటౌన్, జూలై 6 : విద్యార్థులతోపాటు అన్ని రంగాల్లో ఉన్నవారిలోని సృజనాత్మకత, ఆలోచనలను వెలికితీయాలన్న సంకల్పంతో నూతన విధానానికి ప్రభుత్వం ఐదేండ్ల కిందట శ్రీకారం చుట్టింది. చదువుకున్న వారితోపాటు చదువులేని వారిని ప్రో త్సహించేలా ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. కార్యక్రమం ప్రతిఏడాది కొనసాగుతున్నది. ఈ ఏడాది కూడా ఇంటింటా ఇన్నోవేటర్ మరోసారి ముందుకు తెచ్చింది. ఇందుకు గానూ ప్రదర్శనలకు సృజనాత్మకతను జోడించి చేపట్టే నూతన ఆవిష్కరణలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పూర్తి గా ఆన్లైన్ ద్వారానే ప్రదర్శనలు ఇవాల్సి ఉంటుంది. పాఠశాల, కళాశాల విద్యార్థులే కాకుండా, రైతులు, మహిళలు ఇలా ఎవరై నా పాల్గొనవచ్చు. దరఖాస్తులకు అవకాశం ఆగస్టు 5వ తేదీ వరకు ఉన్నది.
నమోదు ఎంపిక ఇలా..
ప్రాజెక్టు రూపకర్తలు తాము రూపొందించిన ప్రాజెక్టు నమూనాను ఇంటింటా ఇన్నోవేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారు తమ ఫోన్లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. ప్రాజెక్టుకు సంబంధించని రెండు నిమిషాల వీడియో, మూడు, నాలుగు చిత్రా లు, రూపకర్త పేరు, ఫోన్ నెంబర్, ప్రస్తుత వృత్తి పూర్తి వివరాలను 9100678543 నెం బర్కు వాట్సాప్ చేయాలి. అలా వచ్చిన ప్రదర్శనలన్నింటినీ రాష్ట్ర ఇన్నోవేషన్ విభాగం పూర్తిగా పరిశీలిస్తుంది. అందులో ఉత్తమ ప్రదర్శనలు జిల్లాకు ఐదు చొప్పున ఎంపిక చేస్తుంది. అలా ఎంపిక చేసిన ప్రదర్శనల్లో ఉత్తమ ప్రదర్శనను ఆగస్ట్టు 15న ఎంపిక చేసి ఆన్లైన్ ద్వారా ప్రదర్శిస్తారు.
ఆవిష్కరణ అంటే..
సమస్యలు మన సమాజంలోనైనా, మన చుట్టూ ఉన్నవైనా, ఇంట్లో సమస్యలైనా, వ్యవసాయం, విద్యా, విద్యుత్, మెకానిక్ ఇలా అన్నిరంగాల్లో ఉన్న వాటిని పరిష్కరించే దిశగా మన ఆలోచనలు ఉండాలి. ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి. ఎలా పరిష్కరించుకోవాలి అన్న దానిపై నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలి.
మహిళల పాత్ర ముఖ్యం..
ఇంటింటా ఇన్నోవేషన్‌లో మహిళల పాత్ర ఎంతో ముఖ్యం. మహిళలు ఇంట్లో ఉండి కూడా ఎన్నో నూతన ఆవిష్కరణలకు శ్రీకా రం చుడతారు. కానీ వాటిని ఎక్కడా ప్రదర్శించరు. అందుకు అవకాశం ఉండదు. అ టువంటి మహిళలకు ఇంటింటా ఇన్నోవేషన్ మంచి వేదిక కానుంది. వారి ఆలోచనలు. ప్రదర్శలను కేవలం వాట్సాప్ ద్వారా ఆవిష్కరించవచ్చు. మహిళలు కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది.
సద్వినియోగం చేసుకోవాలి..
ఇంటింటా ఇన్నోవేషన్‌లో కేవలం విద్యార్థులకే కాకుండా అన్ని వర్గాల వారికి అవకాశం ఉంది. వ్యవసాయదారులు, మహిళలు ఆసక్తి ఉన్న వారు ఎవరైనా పాల్గొనవచ్చు. తాము చేస్తున్న పనుల్లో, వృత్తుల్లో ఇలా ఏదైనా వాటిలో ఆవిష్కరణలు ప్రదర్శించవచ్చు. మహిళలు ప్రతి పనిలో భాగస్వాములుగా ఉంటా రు. కాబట్టి వారు ముందుకు రావాలి. ప్రభుత్వం నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
-రమేశ్, రాష్ట్ర ఇన్నోవేషన్ ఫెలో, టీఎస్ఐఎస్సీ