బిజినేపల్లి, ఏప్రిల్ 20: మండలంలోని శాయిన్‌పల్లి శివారు సమీపంలోని గంగారం బీట్పరిధి టేకులకుంట అటవీ ప్రాంతంలో ఆదివారం మరో జింక మృతిచెంది కనిపించింది. స్థానికుల కథనం ప్రకారం.. కుంట సమీపంలో నిర్మించిన చెక్‌డ్యామ్ వద్ద జింక తల ప్రత్యక్షం కాగా.. మొండెం మాయమైంది. ఈ ఘటనకు సంబంధించి జింక కుక్కల దాడిలో మృతిచెందిందా.. మరేమైనా ప్రమాదం జరిగిందాని స్థానికులు అనుమానిస్తున్నారు. ఫారెస్టు అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.
నెలరోజుల కిందట మండలంలోని వట్టెం సమీపానికి జింక రావడంతో గమనించి అటవీశాఖ అధికారులకు అప్పగించడంతో కిందిస్థా యి సిబ్బంది వచ్చి జింకను గంగారం అడవిలో వదిలేశారు. అదేవిధంగా వారం కిందట కీ మ్యాతండా సమీపంలో ఓ జిం క కుక్కలదాడిలో మృతి చెం ద గా, దానిని ఖననం చేయకుండా అటవీశాఖ అధికారులు అటవీ ప్రాంతంలోని బార్డర్ కాల్వలో నిర్లక్ష్యంగా పడేశారు. అంతేకాకుండా మరో జింకను కుక్కలు వెంబడించి దాడి చేస్తుండగా గమనించిన స్థానికులు రక్షించారు.
అప్పుడు కూడా కిందిస్థాయి సిబ్బంది వచ్చేసరికి అప్పటికే కోలుకున్న జింక అడవీలోకి వెళ్లిపోయింది. ఇంతలోనే శాయిన్‌పల్లి సమీపంలో మృతిచెందిన జింక తల కనిపించిందన్నారు. ఇంత జరుగుతున్నా.. అటవీశాఖ ఉన్నతాధికారులు మాత్రం స్పందించకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అటవీ ప్రాంత పర్యవేక్షణకు సంబంధిత అధికారులు వస్తున్నారో లేదోనని, ఇప్పటికైనా ఫారెస్టు ఉన్నతాధికారులు స్పందించి అడవీలో నివసిస్తున్న జంతువులకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.